పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ భారత్ పై తన అక్కసును వెల్లగక్కాడు. మొన్న మోదీ అమెరికా పర్యటన సందర్భంగా తనను కలిసేందుకు ముందే ట్రంప్ ఈ అంతర్జాతీయ తీవ్రవాది హిట్ లిస్ట్ లో చేర్చిన విషయం తెలిసింది. ఆపై ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ఇద్దరూ ప్రతిజ్న బూనీ పాక్ కు హెచ్చరికలు జారీ చేశారు కూడా. దీంతో సలావుద్దీన్ మరోమారు భారత్‌పై తనకున్న ఆగ్రహాన్ని బయటపెట్టాడు.
సోమవారం పాక్ మీడియా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత్‌పై దాడులు చేస్తాం.. మళ్లీ చేస్తాం అంటూ హెచ్చరించాడు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న వారిని, భారత దళాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని, చివరకు పాక్ అంశంలో పెదవి విప్పని రాజకీయ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇక తమకు పాకిస్థాన్ అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందన్న వాదనను సలావుద్దీన్ తోసిపుచ్చాడు. తమ పోరాటానికి కేవలం నైతిక, రాజకీయ మద్దతు మాత్రమే పాక్ ఇస్తోందని తెలిపాడు.
పాకిస్థాన్ కనుక తమకు పూర్తి స్థాయి మద్దతు తెలిపి ఉంటే కశ్మీర్‌ను ఎప్పుడో స్వాధీనం చేసుకుని ఉండేవాళ్లమంటూ ప్రగల్భాలు పలికాడు. తమకు ఆయుధాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచే సరఫరా అవుతాయని, ఇందుకు కావాల్సిన నిధులను కశ్మీరీలే సమకూరుస్తున్నారంటూ సంచలన ప్రకటన చేశాడు. భారత్ లో అయిదు సార్లు దాడులు నిర్వహించాం. అయితే 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదుల పరిస్థితి మారింది. దీంతో కశ్మీర్ అవతల ఉగ్రదాడులు చేపట్టాలనుకున్నాం. కానీ భారత్ ఇదే అదునుగా భావించి కశ్మీర్ పోరాటాన్ని ఉగ్ర పోరాటంగా పేర్కొనే ప్రమాదముందని ఆగిపోయాం అంటూ తెలిపాడు.
తనపై అమెరికా నిషేధాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ది ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. తానే తలుచుకుంటే అమెరికాపై దాడులు చేయటం చాలా సులువైన పనంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కావాల్సినంత డబ్బు ఇస్తే ఎంతటి అత్యాధునికమైన ఆయుధమైనా సరే తక్షణమే తెచ్చిస్తానని మీడియా ప్రతినిధితో ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more