పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. నిజానికి మార్పిడి మాత్రమే చేసిందని విమర్శలు తారస్థాయిలో వినబడుతున్నా.. పట్టించుకోకుండా మరో కొత్త నోటును ప్రజల అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటి రూ. 200 మాదిరిగానే మరో కొత్త నోటును చెలమణిలోకి తీసుకురానున్నారా..? అన్న సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఏళ్లుగా వినియోగంలో వున్న కరెన్సీనోటు(రూ.500 తరహాలో) నే మళ్లీ కోత్త డిజైన్ తో సరికోత్తగా ముద్రించి.. చెలామణిలోకి తీసుకువచ్చేందుకు రమారమి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.
అసలింతకీ ఈ నోటు డినామినేషన్ ఎంత అంటారా..? వెయ్యి రూపాయలు. ఔనండీ మీరు విన్నది నిజమే. డిమానిటేజైషన్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు చూచాయగా ఇదే విషయాన్ని చెప్పినా.. దానిని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మాత్రం తోసిపుచ్చారు. వెయ్యి రూపాయల నోటును మళ్లీ చెలామణిలోకి తీసుకువస్తారన్న వార్తలు సత్యదూరమని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి.
ప్రభుత్వ కరెన్సీ ప్రిటింగ్ ప్రెస్ లలో ఇప్పటికే అన్ని అనుమతులు పోందిన రూ. వెయ్యి నోట్ల ముద్రణ శరవేగంగా జరుగుతుందని ఈ ఏడాది చివరినాటికి వీటిని చెలామణిలోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా మెండుగా వున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వంద, ఐదోందల నోట్ల మధ్య చిల్లర వ్యత్యాసాన్ని రూ.200 నోటుతో తీర్చేందుకు కొత్తగా వాటిని చెలమాణిలోకి తీసుకువచ్చిన కేంద్రం.. అదే విధంగా రూ.500లకు రూ.2000లకు మధ్య వున్న చిల్లర సమస్యను కూడా తీర్చడానికి రూ.1000 నోటును చెలామణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఈ మేరకు అర్బీఐలో వెయ్యి రూపాయల నోటు ముద్రణలో పాలుపంచుకుంటున్న ఓ అధికారి తమతో విశ్వసనీయంగా చెప్పారని జాతీయ మీడియా తన కథనంలో పేర్కోంది. మెరుగైన భద్రతా లక్షణాలు, కొత్త డిజైన్ తో రూ.1000 కరెన్సీ నోట్లను లాంచ్ చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మైసూర్, సల్బోనిలో ప్రింటింగ్ ప్రెస్ ప్రింటర్లు కొత్తగా రూ.1,000 నోట్లను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నారట. డిసెంబరు 2017 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయని నివేదించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more