అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే మరో నిర్ణయం 7000 మంది ఇండో-అమెరికన్ల మీద పెను ప్రభావంను చూపే అవకాశం కనిపిస్తోంది. చిన్నారులుగా అమెరికాలో అడుగుపెట్టి, అక్కడే ఉంటూ పనిచేసుకుంటున్న లక్షలాది విదేశీయులను తిరిగి స్వదేశాలకు పంపేందుకు సిద్ధమైపోతున్నారు.
తమ తల్లిదండ్రులతో కలసి వచ్చి, పెద్దయ్యాక ఇప్పుడు అక్కడే సెటిలై పోయినవారిని అక్రమ వలసదారులుగా గుర్తించనున్నారు. అమెరికాలో ఉన్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా అప్పటి ఒబామా ప్రభుత్వం 2012 జూన్ లో 'బాల్యంలో వచ్చిన వారిపై చర్యలు వాయిదా (డీఏసీఏ)' పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దుచేయబోతున్నారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ ప్రోగ్రాంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇక ఒబామా ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల ఐదో తేదీలోగా రద్దు చేయాలని, లేకపోతే న్యాయస్థానాలకు వెళతామంటూ ట్రంప్ కు అనుకూలంగా ఓటేసిన రాష్ట్రాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే అందుకోసం చట్టం చేయటానికి ఆరు నెలల సమయం విధించే అవకాశం ఉందని వైట్ హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. డీఏసీఏని ట్రంప్ రద్దు చేస్తే దాని ప్రభావం 8 లక్షల మంది విదేశీయులపై, అందులోనూ 7వేల మందికి పైగా భారతీయులపై ప్రభావం చూపనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more