Rs 200 notes maybe available in ATMs only after three months

New notes maybe available in atms only after three months

New 200 Notes, 200 Notes ATM, New Notes ATM Dry, New 200 and 50 notes

New 200 and 50 notes May Get Delayed to reach people through ATMs. As of now, the new Rs 200 bills have been made available at select RBI offices and bank branches.

కొత్త నోట్లు.. అస్సలు క్లారిటీ లేదు

Posted: 09/04/2017 06:08 PM IST
New notes maybe available in atms only after three months

పెద్ద నోట్ల రద్దు తర్వాత చిన్న నోట్లను ఆలస్యంగా విడుదల చేసింది భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు. ఈ మధ్యే 200 మరియు 50 నోట్లను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చెలామణిలో ఇవి చాలా తక్కువగా దొరుకుతుండటంతో పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా? అని ప్రశ్నలు మొదలవుతున్నాయి.

ముఖ్యంగా రూ. 200 నోట్లు ఏటీఎంల‌కు రావ‌డానికి ఇంకా మూడు నెలల సమయం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎందుకంటే ఆ నోట్లను పంపిణీ చేయ‌డానికి దేశంలోని అన్ని ఏటీఎంలను (టెక్నాల‌జీని) అప్‌డేట్ చేయాల్సి ఉంది. దీనికోసం మూడు నెల‌ల కంటే ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్ని బ్యాంకులు ఏటీఎం మెషీన్ల అప్‌డేష‌న్ పనులు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం.అయితే ఈ విష‌యంపై ఆర్బీఐ నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన స‌మాచారం తెలియ‌రాలేదు.

కాక‌పోతే మార్కెట్లోకి పెద్ద మొత్తంలో రూ. 200 నోట్ల‌ను విడుద‌ల చేసేందుకు ఆర్బీఐ యోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ముద్రణ పనులు కొనసాగుతున్నాయి. అయితే రూ. 200 నోటు ఆర్బీఐ శాఖ‌లతో మ‌రికొన్ని ఇత‌ర బ్యాంకుల్లో మాత్ర‌మే ల‌భిస్తోంది.


చెప్పిందే జరిగింది.. శరద్ యాదవ్

నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మిత్ర పక్షం జేడీ(యూ) రెబల్ నేత శరద్ యాదవ్ డీమానిటైజేషన్ పై విమర్శలు చేశారు. చెప్పిన లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్ని కూడా చేరుకోలేకపోయిందని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని... తద్వారా 50 నుంచి 60 శాతం వరకు ఆదాయాలను కోల్పోయారని చెప్పారు.

New 200 Note 3 Months Time

సరైన ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది ప్రజలు నానా అవస్తలు పడ్డారన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ఇబ్బందుల నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, నోట్ల రద్దుకు సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలన్నీ నియమయ్యాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles