Ammavaru to bless devotees in saraswati alankarana సరస్వతి దేవి అలంకరణ.. అలయాలకు పోటెత్తిన భక్తులు

Ammavaru to bless devotees in saraswati alankarana today

Dussehra Navaratri alankaranalu. Day-7 Saraswathi Devi Alankarana. moola nakshatram, mula nakshatram, Devi Navaratrulu Saraswati Amma vari Alankarana. Dasara Alankaralu, basara temple, mulugu temple, indrakeeladri temple, kanakadurga devi, saraswati devi, latest news

As a part of Dussehra Navaratri today the seventh day Ammavaru will be decorated in the form Saraswathi Devi Alankarana. on this accation devotees throng to temples and performed special pujas.

ITEMVIDEOS: సరస్వతి దేవి అలంకరణ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Posted: 09/27/2017 11:40 AM IST
Ammavaru to bless devotees in saraswati alankarana today

దసరా పండుగ పర్వదినాలలో భాగంగా అన్ని అమ్మావారి అలయాల్లో దేవీ శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కాగా మూలా నక్షత్రం సందర్భంగా అన్ని అలయాల్లో అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ మాతా అలంకరణలో దర్శనమిస్తుండగా, అటు సరస్వతి దేవీ అలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు కూడా ఇవాళ సరస్వతి దేవీ అలకంరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర చదువుల తల్లి క్షేత్రానికి అమ్మవారి జన్మనక్షతం రోజున సరస్వతీ దేవీ అశీర్వాదం కోసం భక్తులు పోటెత్తారు. ఒక్క రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. సరస్వతి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు. వేదపండితులు వేకువజాము నుంచి అమ్మవారికి సరస్వతి వేదపారాయణం నిర్వహించి మహా హారతి ఇస్తున్నారు.

ఇక ఇటు ములుగులోని సర్వసతీ దేవీ అలయంతో పాటు నవరాత్రులు నిర్వహిస్తున్న అన్ని దేవాలయాలకు ఇవాళ వేకువ జామునుంచే భక్తులు అమ్మావారి దర్శనానికి పోటెత్తారు. ప్రముఖ క్షేత్రాలకు చేరుకున్న భక్తులు ఇవాళ ఉదయం నుంచి చిన్నారుల అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే తమ బిడ్డలు చదువులలో రాణిస్తారని భక్తుల విశ్వాసం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Basara  Indrakeeladri  moola nakshatram  devi navaratri  devotees  saraswati devi  alankaram  

Other Articles