Adilabad MP Nagesh house robbed once again మళ్లీ ఎంపీ ఇంట్లో చోరి.. సీసీటీవీ కెమెరాలు ధ్వంసం..

Adilabad mp nagesh house robbed once again

Adilabad MP, TRS MP, Godam Nagesh, House Robbed, Theft, buglary, telangana, cctv footage, crime

Adilabad member of Parliament nagesh house robbed by thieves in late night, robbers even damaged cctv and theft footage after they fled away with Rs. 15 lakh worth gold ornaments and Rs 70 thousand cash.

మళ్లీ ఎంపీ ఇంట్లో చోరి.. సీసీటీవీ కెమెరాలు ధ్వంసం..

Posted: 09/27/2017 12:22 PM IST
Adilabad mp nagesh house robbed once again

ప్రజాప్రతినిధిగా ఎంపకై.. వారి సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లేందుకు ఢిల్లీలోనే మకాం వేసిన అధికార టీఆర్ఎస్ పార‍్లమెంట్ సభ‍్యుడు నగేష్ కు చేధు అనుభవం ఎదురైంది. అదిలాబాద్ నుంచి ఎంపీగా గెలచిన ఆయన.. పండగ నేపథ్యంలో తన కుటుంబసభ్యులను కూడా హస్తినకు పిలిపించుకోగా, అయన సొంత నివాసంలో మాత్రం చోరులు ప్రవేశించి.. నానా హంగామా చేశారు. తాళాలు వేసిన ఇంటిని గుర్తించిన చోరులు రెక్కి నిర్వహించారు.

ఆ తరువాత ఇంటి తాళాలు పగుటగోట్టి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఇంటి చుట్టూ సిసిటీవి కెమెరాలు వున్నాయని గమనించి.. దొంగతనం పూర్తి చేసుకున్నాక వాటిని కూడా ధ్వంసం చేసి.. సిసీటీవీ ఫూటేజీని కూడా ఎత్తకెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా, బుధవారం స్థానికులు గమనించి పోలీసులకు పిర్యాదు చేశారు. ఎంపీ నాగేష్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని దృవీకరించిన పోలీసులు.. వివరాలను తెలిపారు.

ఆదిలాబాద్ హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఎంపీ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో దాచి వుంచిన రూ.71 వేలతో పాటు రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఎంపీ బంధువులు అదిలాబాద్ 1టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే ఎంపీ నాగేష్ నివాసంలో చోరి జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో రెండు పర్యాయాలు కూడా ఇదే విధంగా దొంగతనం జరిగింది. దీంతో పాత దొంగలే మళ్లీ చోరికి పాల్పడ్డారా..? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఇంటి గురించి పూర్తి సమాచారం వున్నవాళ్లే ఈ చోరీలకు పాల్పడుతున్నారా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తూ ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, చోరీ సమయంలో ఎంపీ నగేష్ తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉన్నారు. సమాచారం తెలిసిన పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స‍్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adilabad MP  TRS MP  Godam Nagesh  House Robbed  Theft  buglary  telangana  cctv footage  crime  

Other Articles