Telangana DSC Notification With in Two Days | డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మార్గదర్శకాలు విడుదల చేసిన టీ సర్కార్

Telangana dsc notification soon

Telangana, DSC 2017 Notification, KCR DSC, Telangana DSC Notification

Telangana DSC Notification may coming soon. Already CM KCR and Kadiyam Srihari signed on notification. DSC Rules Guidance Issued.

డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది

Posted: 10/10/2017 06:16 PM IST
Telangana dsc notification soon

తెలంగాణలో గత మూడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రేపు.. మాపు... అంటూ టీ సర్కార్ ఊరిస్తూ నిరుద్యోగులకు ఆశలు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఓ తీపి కబురు చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అందులో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే సంతకం చేసినట్లు తెలిపింది. ఉపాధ్యాయ పోస్టులు జిల్లాకు సంబంధించినవి కాబట్టి కొత్త జిల్లాల ప్రకారమే వీటిని భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎటొచ్చి భర్తీ చేసే పోస్టుల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గురుకులాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినా, దీనికి సంబంధించి రాత పరీక్షను ఇప్పటి వరకు నిర్వహించలేదు.

1998, 2006, 2008, 2012ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఈ విషయం గురించి ప్రస్తావనేలేదని బాధితులు వాపోతున్నారు. మరి వీరి విషయంలో కేసీఆర్ ఏలా స్పందిస్తారో చూడాలి. అదే సమయంలో తెలంగాణలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగితే, తాము కూడా చంద్రబాబు దగ్గర హామీ పొందాలని అంధ్రప్రదేశ్ అభ్యర్థులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles