AAP to protest against metro fare hike సత్యాగ్రహానికి సర్వం సిద్దం.. దిగివచ్చేనా కేంద్రం..?

Aap satyagraha deeksha in protest against metro fare hike

Uber, Ola, Manish Sisodia, DMRC, Delhi Metro, Delhi, Aam Aadmi Party, Arvind kejriwal, rail charges, metro charges hike, aap satyagrah, delhi, nation ews

The Aam Aadmi Party (AAP) on Tuesday said it will launch a 'Metro Fare Satyagraha' from Wednesday against the hike in Delhi metro fares.

సత్యాగ్రహానికి సర్వం సిద్దం.. దిగివచ్చేనా కేంద్రం..?

Posted: 10/10/2017 05:25 PM IST
Aap satyagraha deeksha in protest against metro fare hike

అధికార పార్టీగా పాలన సాగిస్తూనే అటు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్షలు చేపడుతున్న దేశరాజధాని ఢిల్లీలోని అప్ ప్రభుత్వం తాజాగా మరో దీక్షకు పూనుకుంది. రేపు ఉదయం నుంచే అప్ అగ్రనేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సత్యాగ్రహ దీక్షకు పూనుకోనున్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలో ఈ దీక్ష కొనసాగనుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది.

ఎన్నికలలో ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారన్న కక్షను మదిలో పెట్టుకుని కేంద్రం ఢిల్లీవాసులను ఇబ్బందులకు గురిచేస్తుందని అప్ విమర్శించింది. ఓ వైపు గుజరాత్ తో పెట్రోల్ పై నాలుగు శాతం వ్యాట్ తగ్గించిన తమ పార్టీకి రానున్న ఎన్నికలలో లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకున్న బీజేపి పార్టీ.. ఢిల్లీలో మాత్రం ఒక్క ఏడాదిలోనే రెండోసారి మెట్రో రైళ్ళ ఛార్జీలను పెంచిందని అరోపించారు. మెట్రో రైలు చార్జీల పెంపుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది. చార్జీలను పెంచోద్దన్న తమ వినతిని కూడా తిరస్కరించి పెంచడం హేయకరమని దుయ్యబట్టారు.
 
దీనిపై ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ మెట్రో రైలు ఛార్జీల పెంపు వల్ల ఓలా, ఊబర్ వంటి క్యాబ్‌లకే ప్రయోజనం కలుగుతుందన్నారు. మెట్రో ఛార్జీల కన్నా ఈ క్యాబ్‌ల ఛార్జీలు చౌక అవుతాయన్నారు. తమ పార్టీ కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి అన్ని మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద సత్యాగ్రహం చేస్తారన్నారు. ఈ నిరసన కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ముట్టడిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  metro  rail  charges  AAP  satyagrah  Manish Sisodia  Arvind kejriwal  

Other Articles