ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడిగా కన్నా సంచలన విషయాలను తనతోనే సాధ్యమన్న వాఖ్యలతో ప్రజలకు సుపరిచితుడైన కిల్లారి అనంద్ పాల్ (కేఏ పాల్) కు విశాఖపట్నం అర్బన్ ఢిఫ్యూటీ కలెక్టర్ షాక్ ఇచ్చారు. కేఏ పాల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గమ్ (గోసెల్స్ టు అన్ రీచర్డ్ మిలియన్స్) సొసైటీకీ సంబంధించిన ఆస్తులను హత్యాగావించబడిన ఆయన సోదరుడు డేవిడ్ రాజు భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలంటూ తహసీల్దార్ నాగభూషణం నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చారు.
గమ్ సొసైటీకి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి అన్నదమ్ములు ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో, డేవిడ్ రాజు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆస్తుల కోసం డేవిడ్ రాజు భార్య, ఆయన కుమారులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులన్నీ కేఏ పాల్ కే చెందుతాయని, వాటిని ఆయనకే అప్పగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఈ ఏడాది మే 16న గమ్ సొసైటీ ఆస్తులను కేఏ పాల్ కు అప్పగించారు.
దీన్ని సవాల్ చేస్తూ డేవిడ్ రాజు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఆర్డీవో కేఏ పాల్ కు నోటీసులు జారీ చేశారు. కేఏ పాల్ తన అధీనంలో ఉన్న ఆస్తులను అర్బన్ తహసీల్తార్ స్వాధీనం చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఆస్తులను ఎస్తేరు రాణీకి అప్పగించవలసి ఉందని ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఆస్తులను అప్పగించాలని నోటీసులో పేర్కొన్నారు. మరి కేఏ పాల్ అస్తులను రాణికి అప్పగిస్తారా..? లేదా..? అన్నది ఉత్కంఠకరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more