రోడ్డు ప్రమాదాలు అనేకం చూశాం. వాటి గురించి వార్తలు చదివాం.. కానీ ఇలాంటి కారు ప్రమాదం చూడటం ఇదే మొదటి సారి. రోడ్డుకు దాదాపుగా 30 నలభై మీటర్ల దూరంలో వున్న చెట్లల్లోకి ఈ కారు ఎలా వెళ్లింది.? అక్కడి చెట్ల మధ్యన ఎలా చిక్కకుంది. ఇది అర్థంకాక అనేక మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓసారి పైనున్న ఫొటోను పరిశీలించి చూస్తే.. అది కారు అని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హెలికాప్టర్ మాదిరిగా ఎలా ఎగిరింది. దాదాపుగా పన్నెండు అడుగల మేర ఎత్తున చెట్ల కొమ్మల మధ్యలో ఎలా ఇరుక్కుపోయింది.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమైంది..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? ఈశాన్య చైనాలోని హేలాంగ్ జియాంగ్ ప్రావిన్సులోని స్వీహ్వా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వీహ్వా నగరం పరిధిలోని సీబీ ఎక్స్ ప్రెస్ హైవేపై అతివేగంగా దూసుకెళ్లున్న కారు.. అర్థరాత్రి మసకమసకగా కనిపిస్తున్న రోడ్డులో సరిగ్గా కీలకమైన మలుపు వద్ద కారును కంట్రోల్ చేయలేక పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న చెట్లలోకి దూసుకెళ్లిందని చైనా పోలీసులు తెలిపారు. పొడవాటి చెట్ల కొమ్మల మధ్యన కారు ఇరుక్కుపోయింది. దీంతో కారు బానెట్ పూర్తిగా ధ్వంసమైంది.
అయితే అలా చెట్ల కొమ్మల మధ్య చిక్కుకుపోవడం కూడా ఆ కారులోని వున్న ప్రయాణికులకు ముప్పు తప్పింది. కొమ్మల మధ్య ఇరుక్కోవడం వల్లే అందులో వున్న ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ సురక్షితంగా వున్నారు. అర్థరాత్రి ఈ ప్రమాదం జరగడంతో తెల్లవారిన తరువాత.. ప్రయాణికులతో వున్న కారు చెట్ల కొమ్మలపై వెళుతుండటాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారును క్రేన్ సాయంతో బయటికి తీసిన పోలీసులు అంతకుముందే అందులోని ఐదుగురు ప్రయాణికులను క్షేమంగా కిందకి దింపి అస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాన్ని ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more