బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన తనయుడి జే షా కంపెనీపై వస్తున్న అరోపణలపై ఎట్టకేలకు స్పందించారు. కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడి కంపెనీ ఏకంగా 16 వేల రెట్లు టర్నోవర్ సాధించిందని ది వైర్ వెబ్ పోర్టల్ ప్రచురించిన కథనంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కంపెనీలో అవినీతికి అస్కారమే లేదని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లమని సూచించారు.
తన తనయుడి పేరిట వున్న కంపెనీలు ఏవీ కూడా ఒక్క రూపాయి మేర కూడా అవినీతి వ్యాపారానికి పాల్పడలేదని చెప్పారు. ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభాలు దక్కలేదని చెప్పారు. బోఫోర్స్ కేసులో కాంగ్రెస్ పార్టీకి లభించినట్లు తెరవెనుకగా ఎలాంటి మూటలు కూడా లభించలేదని ఆయన చెప్పారు. పీకల్లోతు అవినీతి, అక్రమాల కేసుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్.. తమపై వచ్చిన ఏ ఒక్క కేసు విషయంలోనైనా న్యాయపోరాటం చేసిందా..? అని నిలదీశారు.
కాంగ్రెస్ చేయని పనిని తన తనయుడు చేశారని, ది వైర్ వెబ్ సైట్ ప్రచురించిన కథనంపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కింద రూ.100కోట్ల దావా కూడా వేశాడని, ఇలా కేసులు వేయాలంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వుండాలని అన్నారు. జేషా అవినీతి ఆరోపణలపై మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే.. కోర్టుకు వెళ్లండి’ అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలు అరోపణలు చేస్తున్నట్లుగా వారి వద్ద అధారాలుంటే న్యాయస్థానంలో కేసులు వేయాలని ఆయన సూచించారు.
జేషా వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండటంపై ఆయన ఈ విధంగా స్పందించారు. బీజేపి అధికారంలోకి వచ్చాక తన తనయుడి సంస్థ ఆదాయం 16వేల రెట్లు పెరిగిందని కథనాన్ని ఆయన తప్పుబట్టారు. తన తనయుడు చేసే వ్యాపారంలో టర్నోవర్ ను బట్టి లాభాలు వుంటాయని అనుకోవడం తప్పన్నారు. రూ. 80 కోట్ల మేర టర్నోవర్ సాధించినప్పటికీ తన తనయుడి సంస్థ కోటిన్నర రూపాయల నష్టాన్ని ఎదుర్కోందని చెప్పారు. టర్నోవర్ అంటే లాభం అన్న అర్థం వచ్చేలా కథనాలు ప్రచురించినందుకే దావా వేశామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more