Delhi ATM dispenses fake Rs 2000 note ఢిల్లీ ఏటీయం కేంద్రం నుంచి నకిలీ పెద్ద నోటు

Before anti black money day another atm dispenses fake rs 2000 note

fake notes, 'anti-black money' day, demonetisation anniversary, fake currency, ATM, Black Money, Demonetisation, Economy

Before the country observes the one year anniversary of demonetisation on November 8 another case of fake notes being dispensed from an ATM has been noted.

నల్లధనం వ్యతిరేక దినోత్సవానికి ముందు ఈ ఘటన

Posted: 11/07/2017 11:38 AM IST
Before anti black money day another atm dispenses fake rs 2000 note

దేశంలో నల్లధనం, అవినీతి, ఉగ్రవాద సహకారానికి కళ్లేం వేసేందుకే అత్యంత సహసోపేత నిర్ణయం తీసుకున్నామని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఎన్ని సార్లు చెప్పినా.. అదంతా తూచ్ అన్నట్లుగా చేస్తున్నాయి ఏడాది కాలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న ఘటనలు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా నవంబర్ 8న నల్లధన వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఒక్క రోజు ముందు కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూడం.. అదీనూ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో కావడం చర్చనీయాంశంగా మారింది.  

ఢిల్లీలో సోమవారం రాత్రి ఏకంగా ఏటీఎం నుంచే ఓ వ్యక్తికి రూ 2000 నకిలీ నోటు వచ్చింది. నకిలీ అంటే అలాంటి ఇలాంటి నకిలీ నోటు కాదు.. అర్థనారీశ్వరుడి తరహాలో సగభాగం నోటుగా మరో సగభాగం తెల్ల కాగితంలా వుంది. ఈ నోటును అందుకున్న వ్యక్తి ఏకంగా షాక్ కు గురయ్యాడు. దక్షిణ ఢిల్లీలోని డీసీబీ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో మహ్మద్‌ సదాబ్ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. డీసీబీ బ్యాంకు ఏటీఎంలో రూ 10,000 డ్రా చేసిన సదాబ్ కు ఈ నోటును చూసి విస్మయానికి లోనయ్యాడు. వెంటనే తేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ నకిలీ నోటుపై తన ఖాతా వున్న యస్ బ్యాంకు అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని భావించిన సదాబ్.. బ్యాంకు కస్టమర్ కేర్ విభాగానికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఇక లాభంలేదని పోలీస్‌ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, నగదు నింపిన సిబ్బందిని, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. గత ఏడాది కాలంగా ఢిల్లీలోని పలు ఏటీయం కేంద్రాలలో అనేక పర్యాయాలు నకిలీ పెద్దనోట్లు వచ్చాయి. అయితే ఈ ఘటన కూడా ఆ జాబితాలోనే చేరిపోతుందా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles