chennaiah purchased assets with chiranjeevi's money మెగాస్టార్ డబ్బుతో అస్తులు కొన్న చెన్నయ్య

Chiranjeevi house maid chennaiah purchased assets with megastar s money

chiranjeevi, megastar, congress, former union minister, chennaiah, manager, house maid, assets, plots, houses, jubilee hills police, crime, telangana

house maid of former union minister and tollywood megastar chiranjeevi, chennaiah revealed shocking news in police investigation, he told he purchased assets with the amount he stole from megastar's home.

మెగాస్టార్ డబ్బుతో అస్తులు కొన్న చెన్నయ్య

Posted: 11/07/2017 12:14 PM IST
Chiranjeevi house maid chennaiah purchased assets with megastar s money

కాంగ్రెస్ నాయకుడు, టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి నివాసంలో చోరి జరిగిందన్న వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారిన నేపథ్యంలో హుటాహుటిన స్పందించిన పోలీసులు చిరంజీవి మేనేజర్ పిర్యాదులో అనుమానం వ్యక్తం చేసిన ఇంటి పనిమనిషి చెన్నయ్యను పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ దొంగ పనిమనిషి చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లోని సహుద్యోగులు కూడా విస్తుపోయే విషయాలను పోలీసుల విచారణలో వెల్లడించాడు.

చిరంజీవి ఇంట్లో రెండు లక్షల రూపాయల నగదు చోరి అయినట్లు మాత్రమే చిరంజీవి మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేయగా.. ఇది తొలిసారి కాదని, తాను గతంలో కూడా మెగాస్టార్ ఇంట్లో చోరి చేశానని నిందితుడు అంగీకరించాడు. పనిమనిషి ముసుగులో చిరంజీవి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నయ్య.. అదను దొరికినప్పుడల్లా డబ్బును తస్కరించడం.. దానిని సేఫ్ గా తరలించడం పనిగా పెట్టుకున్నాడు. అయితే ఆ డబ్బుతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని కూడా చెప్పాడని పోలీసులు వర్గాలు చెప్పాయి.

గతంలో చోరి చేసిన డబ్బుతో రెండు ఫ్లాట్లకు అడ్వాసులు చెల్లించానని, అయితే తాజగా తస్కరించిన రెండు లక్షల రూపాయల డబ్బుతో వారికి పూర్తి చెల్లింపులు చేశానని అంగీకరించాడు. డబ్బులు పూర్తిగా చెల్లించేందుకు అగ్రిమెంట్ సమయం సమీపించినందునే తాను దొంగతనం చేశానని చెన్నయ్య తన వాంగ్మూలంలో అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు చెన్నయ్య కొనుగోలు చేసిన ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి ఇంట్లో పనిచేస్తున్న చెన్నయ్య ఇలా దొంగతనం చేయడంతో చిరంజీవి నివాసంలోని ఇతర ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  congress  chennaiah  manager  house maid  assets  plots  houses  jubilee hills police  crime  

Other Articles