సరిగ్గా పక్షం రోజుల క్రితం మన రాష్ట్ర పోలీసులు.. ఉత్తర రాష్ట్రాల్లోకి వెళ్లి అక్కడ అంతరాష్ట్ర దోంగలతో కలబడి.. వారితో జరిగిన ఎన్ కౌంటర్ దొంగలను మట్టుబెట్టి.. శభాష్ ఏపీ పోలీస్ అనేలా గర్వింపజేశారు. ఇలాంటి కీర్తిని వేనోళ్ల పొడుగుతున్న తరుణంలో మళ్లీ పోలీసులే మన రాష్ట్ర పరువును బజారుపాలు చేశారు. దొంగల నుంచి దొంగవస్తులను కొన్నా దోంగలే అన్న విషయం తెలిసి కూడా అలాంటి దొంగ వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్నారు.
ఇంతలోనే ఊహించని విధంగా రాజస్థాన్ రాష్ట్ర ఏసీబీ అధికారులు అక్కడ మాటు వేసి లంచం తీసుకుంటుండగా.. మన రాష్ట్ర పోలీసుల్ని అడ్డంగా బుక్ చేశారు. ఇలా దొంగల్ని పట్టుకుందామని వెళ్లి పోలీసులే అరెస్ట్ అయిన సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దొంగల ముఠా నుంచి రూ.1.40 లక్షలను లంచంగా తీసుకుంటూ అక్కడి ఏసీబీ అధికారులకు విశాఖపట్నం క్రైం బాంచ్ కు చెందిన నలుగురు పోలీసులు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు అధికారులే కావడం గమనార్హం.
విశాఖ జిల్లా పీఎం పాలెం హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్ బాలే జిల్లా దింగ్మా ప్రాంతానికి చెందిన రాకేశ్ అద్దెకు వుంటున్నాడు. గత అగస్టు 29న గుంటూరు మంగళగిరికి చెందిన వెంకటరమణ అనే నగల వ్యాపారిని బంగారం వ్యాపారమని నమ్మించి.. పిలిచి.. తాళ్లతో కట్టేసి 3 కిలోల బంగారు ఆభరణాలతో పారిపోయాడు. ఈ ముఠాలో అతనితో పాటు రాజస్తాన్ కు చెందిన హీరాలాల్, రాములతో పాటు చత్తీస్ గడ్ కు చెందిన హిమ్మత్ పటేల్, రమేష్ పటేల్, అగృత పటేల్ వున్నట్లు గుర్తించిన పోలీసులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది.
అయితే వీరి నెంబర్లకు స్థానిక జిలేబి వ్యాపారి సంతోష్ ఫోన్ చేసినట్లు కాల్ లిస్టులో బయటపడటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తమ విచారణలో సంతోశ్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా సభ్యులను పట్టుకోవడానికి విశాఖపట్నం క్రైంబ్రాంచ్ సిఐ సి.వి.ఆర్.కె.చౌదరి, పరవాడ ఎస్ఐ ఎస్.కె.షరీఫ్, మహరాణిపేట ఎస్ఐ గోపాలరావు, వన్ టౌన్ కానిస్టేబుల్ హరిప్రసాద్ లను పంపించారు. అయితే అక్కడ బంగారం కొనుగోలు చేసిన వ్యాపారులతో డీల్ కుదర్చుకోవడం.. రెడ్ హ్యండెండ్ గా పట్టుబడటంతో మన పోలీసులే దోంగల్లా అరెస్టయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more