aliens birds not consuming food kept by strangers ఈ వింత పక్షులు.. అమ్మ తెచ్చిన అహారమే తింటున్నాయి..

Aliens birds found in vizag consuming only its mother bought food

aliens, vizag, bird, alien birds, under construvtion building, aliens on earth, aliens caught on cam, aliens hulchul in vizag, visakhapatnam, latest news

alien birds found at vizag in under construction buliding are consuming only the food bought by its mother and not even touching the food kept by strangers, its viral on social media.

ITEMVIDEOS: ఈ వింత పక్షులు.. అమ్మ తెచ్చిన అహారమే తింటున్నాయి..

Posted: 11/21/2017 12:08 PM IST
Aliens birds found in vizag consuming only its mother bought food

విశాఖపట్నంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా జీవులను చూడకపోవడంతో.. వింత జీవులుగా పరిగణిస్తూ వీటిని చేసేందుకు స్థానికులు అసక్తిని కనబరుస్తూ వాటి అకలిని తీర్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. మొత్తంగా మూడు పక్షులు వింత రూపంలో కనిపించి వైరల్ అవుతున్న క్రమంలో స్థానికులు వాటికి అహారాన్ని పెట్టారు.

అయితే అవి వారు తీసుకువచ్చిన అహారాన్ని ఏ మాత్రం ముట్టుకోవడం లేదు. కనీసం వాటి వైపు కూడా చూడటం లేదు. అయితే మనం తినే ఫలాలను కూడా అవి ముట్టకపోవడంతో మరి అవి ఎలా క్షుద్భాథను తీర్చుకుంటున్నాయనేగా మీ సందేహం. అయితే బాత్రూమ్ కి ఉన్న రంధ్రంలోంచి ఆ ఏలియన్ పక్షుల తల్లి బయటకు వెళ్లి ఏదో ఆహారం తెస్తోందని, దానిని మాత్రమే తింటున్నాయని ఆ సంస్థ జనరల్ మేనేజర్ జేకే నాయక్ తెలిపారు.

అసలు ఇవి ఇక్కెడ వున్నాయన్ని ఎలా తెలిసిందో తెలుసా..?

వైజాగ్ వన్ టౌన్ లో పాత పోస్టాఫీసుకు దగ్గర్లో పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఒడిశా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ అనే షిప్పింగ్ కంపెనీ ఉంది. కార్యాలయం నుంచి దుర్వాసన రావడంతో...ఆ కంపు భరించలేక, ఎక్కడ ఎలక చచ్చిందోనని వెతకడం ప్రారంభించారు. దీంతో వారికి బాత్రూమ్ పైనున్న రూఫ్ మీద, స్లాబు కింద చిత్రమైన పక్షులు కనిపించాయి. మొదట గుడ్లగూబలుగా భావించిన వారు, వాటికంటే పెద్దగా, కాళ్లతో శబ్దం చేయడాన్ని గమనించి, ఇవేవో వింతగా ఉన్నాయే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఏలియన్ పక్షులని ప్రచారం జరుగుతోంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alien birds  food  mother strangers  vizag  visakhapatnam  

Other Articles