గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొంత కాలంగా కాంగ్రెస్ పటీదార్ కులస్థులపై పెట్టుకున్న అశలు ఎట్టకేలకు ఫలించాయి. పటీదార్ అనామత్ అందోళన్ సమితి అధ్యక్షుడు హార్థిక్ పటేల్ వర్గీయుల నుంచి కాంగ్రెస్ పార్టీకి శుభవార్త అందింది. అసెంబ్లీ సీట్ల ఒప్పందం విషయంలో కాంగ్రెస్, పటేల్ వర్గీయుల మధ్య ఒప్పందం విషయంలో కాసింత బేధాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. పటేల్ వర్గీయులు అడిగినన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో ఆ పార్టీకి పటేల్ వర్గీయులు మద్దతు ప్రకటిస్తారా? అన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది.
ఎట్టకేలకు హార్థిక పటేల్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో పాటు పటీధార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇప్పుడున్న 49 శాతం రిజర్వేషన్ ను ఏమాత్రం కదపకుండా పటీదార్ సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కూడా కల్పిస్తామని హామి ఇచ్చిన నేపథ్యంలో హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్కు, తమకు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. తమ షరతులకు కాంగ్రెస్ ఒప్పుకుందని తెలిపారు.
తమ వర్గానికి రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పిందని వివరించారు. కాంగ్రెస్, పటేల్ నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అసెంబ్లీ సీట్ల టికెట్ల గురించి తాము అసలు కాంగ్రెస్ను అడగలేదని హార్దిక్ పటేల్ చెప్పుకొచ్చారు. తమ కమ్యూనిటీని విడదీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more