85-yr-old Arrested for Raping Minor Girls కాప్రాలో వృద్ద కామాంధుడు.. బాలికలపై అఘాయిత్యం

85 yrs old man held for sexual assault on girls in kapra

85-year-old man arrested, crime against child, crime against children, M Satyanarayana, kapra minor girls, sexual assault, mahesh bhagwat, rachakonda police, students, telangana crime

An 85-year-old retired central government employee, who sexually abused six minor girls after luring them with chocolates, was arrested by the Hyderabad police

కాప్రాలో వృద్ద కామాంధుడు.. బాలికలపై అఘాయిత్యం

Posted: 11/23/2017 09:01 AM IST
85 yrs old man held for sexual assault on girls in kapra

చిన్నారులన్న కనికరం కూడా లేకుండా మొగ్గలోనే వారి పసిప్రాయాన్ని తుంచేసే ఘటనలు అనేకం మన మధ్య జరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. మగమృగాళ్లలో మార్పలు వచ్చేంత వరకు ఈ దారుణాలకు కళ్ళెం పడదు. యువకులే కాదు ఏకంగా కాటికి కాళ్లు చాపిన వృదులు కూడా చిన్నారి బాలికపై తమ కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. తాజాగా రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటనే పెను కలకలం రేపుతుంది.

చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూసి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న 85 ఏళ్ల వృద్ధుడి ఆట కట్టించింది హైదరాబాద్ షీ టీమ్స్ బృందం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ షేక్ సలీమా (షీ టీమ్స్) కథనం ప్రకారం.. కాప్రా ప్రథమపురి కాలనీకి చెందిన ఎన్.సత్యనారాయణరావు (85) మాజీ రైల్వే ఉద్యోగి. గతేడాది భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంటికి సమీపంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికలపై కన్ను వేశాడు.

చిన్నారులకు చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లి గత ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. గత కొన్ని రోజులుగా విద్యార్థినులు ముభావంగా కనిపించడం, హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు వారి నోటు పుస్తకాలను తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. వారి పుస్తకాల్లోంచి వంద రూపాయల నోట్లు కనిపించడంతో వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి ఆరా తీశారు.
 
 సత్యనారాయణ తాత తమకు ఆ డబ్బులు ఇచ్చినట్టు చెప్పిన బాలికలు జరిగిన దారుణాన్ని వివరించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండడంతో కాలక్షేపం కోసమే వారిని పిలుస్తుండేవాడినని, అంతకుమించి వేరే ఉద్దేశం లేదని సత్యనారాయణరావు వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles