సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేటేపుతూ.. సరిహధ్దు వెంబడి ప్రాంతాల్లో నిత్యం రావణకాష్టంలా హింసను రగుల్చుతున్న పాకిస్థాన్ ను అవకాశం అందివచ్చిన అన్ని అంతర్జాతీయ వేదికలపై తూర్పారబడుతున్న భారథ్.. దాయాధి చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ను 'టెర్రరిస్థాన్' అని సంబోధిస్తూ వస్తుంది. కేవలం కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పోడవటమే కాకుండా మరోవైపు ఉగ్రవాద శిక్షణలు, వారికి రక్షణ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ ను కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా దాయాధికి మరో పేరుతో నామకరణం చేసింది భారత్.
కాశ్మీర్ అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ.. అక్కడి ప్రజలను మనోభావాలను భారత ప్రభుత్వం అణిచివేస్తుందని వాదనను తెరపై చూపుతు.. తమ దేశంలో ఏకంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను అబోట్టాబాద్ లో దాచిపెట్టన ఘటన అమెరికా మెరుపుదాడిలో హతుడైన తరువాత కానీ విషయం బయటకు రాలేదు. అంటే పాక్ ఎంత పకడ్భందీగా ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తుందో అర్థమవుతుందని భారత్ వాదిస్తుంది. లాడెన్ ఒక్కడే కాదు భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కూడా పాకిస్థాన్ లో సేద తీరుతున్నాడని భారత్ ఇప్పటికే అరోపించింది. ఇందుకు తగ్గ సాక్షాధారాలు కూడా బయటపడ్డాయి.
ఈ క్రమంలో పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. పాకిస్థాన్ అంటే ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన ప్రాంతమంటూ సునిషితమైన విమర్శలతో భారత్ అంతర్జాతీయ వేదికలపై దాయాధి తీరుపై అక్షేపిస్తున్నా.. వారిలో కించింత్ మార్పైనా రాలేదు. దీంతో మరో ప్రత్యేక పదాన్ని వాడుతూ పాక్ ను మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది భారత్. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మానవ హక్కుల విభాగంలో భారత రెండో కార్యదర్శి మినీ దేవి కుమమ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ను ఎస్ టీ జెడ్ (స్పెషల్ టెర్రరిస్ట్ జోన్)గా అభివర్ణించారు.
ఈ మేరకు పాకిస్థాన్ పిలవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని.. ఈ పదానికి పాకిస్థాన్ సరిగ్గా సరిపోతుందని కూడా భారత్ అధికారులు పేర్కోన్నారు. అందుకు గల కారణాలను కూడా అదే వేదికపై విశ్లేషించారు. పాకిస్థాన్ లో ప్రత్యేక టెర్రరిస్టు జోన్ లు ఎన్నో ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు, దేశంలో జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న వారిని ఇవి నియంత్రిస్తున్నాయని భారత్ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని అనేక పర్యాయాలు తాము దాయాధిని డిమాండ్ చేసినా అవి చెవిటివాడి ఎదుట శంఖం ఊదినట్లుగానే విఫలమయ్యాయని ఆరోపించారు. పాక్ లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిజమైన సమస్య పాకిస్థాన్ ఉగ్రవాదమేనని ఎస్ టీ జెడ్ లను నడుపుతున్న పాకిస్థాన్ తమను విమర్శించడం ఏంటని మినీ దేవి కుమమ్ నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more