ఖమ్మం జిల్లాలో ఘోరం విషాదం అలుముకుంది. వధువు నివాసంలో పెళ్లి చేసుకుని ఎన్నో కొంగ్రోత్త అశలతో.. భవిష్యత్తుపై బారేడేసి నమ్మకంతో తన నివాసానికని బయలుదేరిన ఆ నవ వరుడ్ని రోడ్డు ప్రమాదం కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డ్రైవర్.. మార్గమధ్యంలో నిద్రలోకి జారుకుని వాహనంపై నియంత్రణను కోల్పోవడంతో కారు కాస్తా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనింది. దీంతో బంగారు భవిష్యత్తుపై కలలు కంటూ వస్తున్న వరుడ్ని కాస్తా విధి వక్రీంచి తిరిగిరానీ లోకాలకు తరలించింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వరుడితో పాటు ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనాస్థలంలోనే అసువులు బాసారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా వధువు కూడా తీవ్ర గాయాలపాలైంది. అమె కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని వైద్యులు తెలిపారు. కాగా 24 గంటల గడిస్తే కానీ అమె పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు. అయితే అమె కాళ్లకు వేసిన పసుపు పారణి అరకముందే అమెకు వైదవ్యాన్ని విధి ప్రసాదించడంతో స్థానికంగా విషాదావాతావరణం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న(మార్చి8) రాత్రి పెళ్లిచేసుకొన్న ఓ జంట.. వరుడి స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు ఇన్నోవా కారులో బయలుదేరారు. నవవధూవరులతో పాటు మొత్తంగా ఎనమిది మంది ఈ కారులో ప్రయాణిస్తున్నారు. కాగా మార్గమధ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు వద్దకు చేరుకోగానే కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతడికి కారుపై నియంత్రణ కోల్పోవడంతో.. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న చెట్టను బలంగా ఢీకొనడంతో ప్రమాధం సంబవించింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more