రాష్ట్ర విభజన జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలో కి రావడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ మధ్దతు తో పాటు తమ పార్టీలో పెట్టుకున్న పొత్తే కారణమని.. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా.. పవన్ కల్యాన్ మద్దతు ఇవ్వకపోయినా టీడీపీ అధికారానికి దూరమయ్యూదని, అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదని ఆయన పేర్కోన్నారు.
చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చుని ఉండేవారని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చూంటే ఎంతటి అసహనం కనబర్చేవారో అందరికీ తెలసునని, డాక్టర్ వైఎస్ సహా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హాయాంలో ఆయన చెప్పిన మాటలు, ప్రభుత్వాలపై అయన చేసిన తిరుగుబాటు.. తొమ్మిదేళ్లు సీఎం గా చేశానని చెప్పిన అధికారులతో వాదించిన అయన అహంకార ధోరణి అన్ని స్పష్టంగా ప్రజలు చూశారని, అయితే బీజేపితో పొత్తుతో పాటు పవన్ ప్రచారమే ఆయనకు గత ఎన్నికల్లో మేలు చేసిందని ఆయనకు కూడా తెలుసునని, అయినా దానిని తెరపై కనిపించనీయకుండా.. అంతా తన క్రెడిట్ గానే చెప్పుకోవడం చంద్రబాబు నైజమని విష్ణుకుమార్ రాజు పేర్కోన్నారు.
టీడీపీ తమకు మిత్రపక్షం కాబట్టే ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, ఇకపై అలా ఉండదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. విశాఖపట్టణంలో జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి రావడానికి కారణం తానేనన్నారు. తనవల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందన్నారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని అన్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్‌పై మాట్లాడుతూ.. రైల్వే జోన్ తప్పకుండా వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more