2019 ఎన్నికల్లో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని దీంతోనే దేశానికి మూడో పర్యారం స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన అవసరముందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగానే కాంగ్రెస్ ముక్త్ భారత్ ను గుర్తు చేసిన రాజ్ ధాకరే అదే విధంగా దేశంలో ప్రస్తుతం మోడీ ముక్త్ భారత్ అవసరముందని అన్నాడు. నరేంద్రమోడీ పాలన నుంచి భారతావనికి విముక్తి కలిగించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో 'మోదీ ముక్త్ భారత్' తన లక్ష్యమని, ఇందుకు అన్ని రాజకీయపక్షాలు తనతో కలవాలని కోరారు. నరేంద్ర మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన అరోపించారు. ప్రధాని మోడీ మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ ఆయన అభివృద్ది మాత్రం కనీసం గడప దాటడం లేదని దుయ్యబట్టారు.
దేశస్వాత్రంత్యం కోసం మహానీయులు పోరాటాల ఫలితంగా 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని, ఆపై 1977లో (ఎమర్జెన్సీ) అత్యవసర పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికల్లో ఇంకోసారి స్వాతంత్ర్యం వచ్చిందని, ఇక 2019లో మోదీ నుంచి ప్రజలకు ముక్తిని కలిగించడం ద్వారా మూడోసారి స్వాతంత్ర్యం వస్తుందని రాజ్ ధాకరే అభిప్రాయపడ్డారు. మోడీ పాలనలో కేవలం పారిశ్రామిక వేత్తలు మాత్రమే సుఖంగా వున్నారని, మిగిలిని అన్ని వర్గాల వారు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోడీ తాను అవినీతి రహిత పాలన చేస్తున్నానన్నని ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ పెద్ద నోట్ల రద్దుపై విచారణ జరిపిస్తే, స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద కుంభకోణం అవుతుందని అరోపించారు. ఇది చాలదన్నట్లు తన అనుయాయువడైన బీజేపి జాతీయ అధ్యక్షుడి కుమారుడు జైషా అవినీతి కేసును కూడా పక్కదారి పట్టించారని అరోపించారు. మహారాష్ట్రలో భూగర్భ జలాలు చాలా వేగంగా అడుగంటి పోతున్నాయని ఇస్రో ఇచ్చిన నివేదికను ప్రస్తావించిన ఆయన, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్ థాకరే ఇచ్చిన పిలుపు ముంబైని షేక్ చేస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలు గుజరాతీలపై దాడులకు పాల్పడుతున్నారు. బై-అహ్మదాబాద్ హైవేపై ఉన్న దాబాలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. షాపుల సైన్ బోర్డును ధ్వంసం చేశారు. గుజరాతీల ఆస్తులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలో కూడా ముంబై, దాదర్ లలో దాడులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ముంబైలోని గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇక అదే క్రమంలో రాజ్ థాకరే అటు దివంగత నటి, శ్రీదేవి సహా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయుడు కాదని రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. అక్షయ్ కుమార్ పాస్ పోర్ట్ లో కెనడియన్ గా ఉందని అన్నారు. వికీపీడియా కూడా ఆయన భారత్ లో పుట్టిన కెనడియన్ గానే పేర్కోని వుందని తెలిపారు. ఒకప్పటి నటుడు మనోజ్ కుమార్ అడుగుజాడల్లో అక్షయ్ కుమార్ నడిచే ప్రయత్నం చేస్తున్నాడని రాజ్ ఠాక్రే విమర్శించారు.
సినీ నటి శ్రీదేవి దేశానికి ఏం సేవ చేసిందని ఆమె భౌతికాయంపై జాతీయ పతాకాన్ని ఉంచారని ఆయన కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీదేవి అంత్యక్రియులు అధికార లాంఛనాలతో జరిపించడానికి గల కారణం ఏంటని నిలదీశారు. శ్రీదేవి విషయంలో మీరు వ్యహరించిన తీరు ఇతర పార్టీల నేతలు వ్యవహరించి వుంటే.. మీరు మౌనంగా వుండేవారా.? అని ప్రశ్నించారు. మీరు చేసే చర్యల్లోనే మీకు ఓ న్యాయం వుంటే మరోకరికి మరో న్యాయమా.? అని ప్రశ్నించారు. ఇక పనిలో పనిగా మీడియాపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. బీజేపియేతర పార్టీలు ఇలా వ్యవహరించివుంటే మీడియా కూడా గగ్గోలు పెట్టి ఉండేదని, మోదీ పట్ల ఉన్న భయంతోనే మీడియా మౌనం వహించిందని ఆయన విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more