Ex-CBI JD Lakshmi Narayana To Enter Politics జనసేనలోకి లక్ష్మీనారాయణ.. పదవికి రాజీనామా..

Ex jd lakshmi narayana resigns rumours on joining janasena

JD Lakshmi Narayana, Ex CBI JD, Politics, JanaSena, pawan kalyan, Adhra pradesh special status, andhra pradesh, politics

janasena supports highway blockage agitation and black flag protest throughout the state. His political foray is expected to draw a lot of attention.

జనసేనలోకి లక్ష్మీనారాయణ.. పదవికి రాజీనామా..

Posted: 03/22/2018 06:08 PM IST
Ex jd lakshmi narayana resigns rumours on joining janasena

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఓ వైపు అలజడి రగలిస్తున్న సమయంలో తన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పమున్న వ్యక్తి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీగా వున్న లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. అసలు ఏవరీ లక్ష్మీనారాయణ అంటే.. జగన్ అక్రమాస్థుల కేసును సీబిఐ జేడీగా విచారించి.. కేసులు నమోదు చేసిన ఉన్నతాధికారే లక్ష్మీనారాయణ.

ఈ కేసుల వ్యవహారంలో ఆయన నికచ్చిగా వ్యవహరించారన్న ప్రశంసలు అందుకున్న ఆయనను ఆ తరువాత అనేక పాఠశాలు, కళాశాలు.. ఆయనతో తమ విద్యాసంస్థల్లో ప్రసంగాలు ఇవ్వాలని ప్రత్యేకంగా అహ్వానించాయి. దీంతో విద్యార్థులతో పలు సమావేశాల్లో పాల్గోన్న అయన నీతి, నిజాయితీగా వుంటడం ఎంత ముఖ్యమో.. అవినీతి జరుగుతున్నా చూస్తూ మిన్నకుండటం కూడా అంతే తప్పని హితబోధ చేశారు.

ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు తన స్వచ్చంద పదవీ విరమణ లేఖలను పంపినట్లు ప్రచారం సాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామా దరఖాస్తును ఆమోదించాల్సి ఉంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా..? లేక రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

కాగా ఆయన పవన్ కల్యాన్ నేతృత్వంలోని జనసేన పార్టలో చేరనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. నీతి, నిజాయితీకి కట్టుబడిన వ్యక్తిగా పవన్ కల్యాన్ తో జతకట్టి రాజకీయాల్లోకి రావాలని, తన రాష్ట్రానికి సేవ చేయాలని అయన నిర్ణయించుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ తన రాష్ట్రానికి అధికారిగా కాకుండా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా సేవ చేయాలన్న సత్సంకల్పంతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles