పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అఫ్ బాటలో మరో బ్యాంకు కూడా నడించింది. ఇన్నాళ్లు అటు ముంబై, ఇటు చెన్నై సహా దేశంలోని పలు బ్యాంకుల్లో వెలుగుచూసిన కుంభకోణాలు తాజాగా మన హైదరాబాద్ లో కూడా వెలుగుచూశాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ శాఖకు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1394 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూడడం సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ ఈ కుంభకోణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే... టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 1997లో హర్యానాలోని గుడ్ గావ్ కేంద్రంగా ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తొట్టెంపూడి సలలిత్ వ్యవహరిస్తున్నారు. టొటెం సంస్థ హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏకంగా రూ.314 కోట్లను తీసుకోగా, ఇదే లీడ్ బ్యాంక్ గా ఉన్న ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి 1394 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. తీసుకున్న రుణం మొత్తాన్ని వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరచి వాటిల్లో జమచేశారు. ఇలా మార్చడానికి భారీ ఖర్చులను సాకుగా చూపారు.
ఇక రుణాలు పొందిన తరువాత తిరిగి చెల్లింపులు చేయకుండా టొటెం సంస్థ చేతులెత్తేసింది. బ్యాంకు అధికారులు నోటీసులు పంపి.. చివరకు 2012 జూన్ 30న వీటిని వసూలు కాని మొండి బకాయిలుగా రైట్ అఫ్ చేశారు. అనంతరం ఈ సంస్థ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న 8 బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. దీంతో సీబీఐకి యూబీఐ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీబీఐ, హైదరాబాదులోని టొటెం సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్లు సలలిత్, లలిత ఇళ్లల్లో సోదాలు నిర్వహించి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more