కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు చోటుచేసుకుంది. కన్నడనాట తెలుగు ప్రజలు గణనీయంగా ఉండటంతో చిరంజీవి ప్రచారం పార్టీకి బాగా కలిసివస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం యోచనగా తెలుస్తోంది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ డి.శివకుమార్ శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశారు.
22 మంది సీనియర్ నేతలు
కర్ణాటక ఎన్నికల ప్రచారబరిలో సహచర విపక్ష పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లను కూడా కాంగ్రెస్ ఈసారి ప్రచార బరిలోకి దింపుతుండటం విశేషం. కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు కొద్దికాలంగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ పేర్లు కూడా ఉన్నాయి. అలాగే 22 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు కూడా ఖరారయ్యారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, శశిథరూర్, సచిన్ పైలట్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, అశోక్ చవాన్. మహమ్మద్ అజారుద్దీన్, అశోక్ గెహ్లాట్, కుష్బూ, నగ్మా, సుచిత్రా దేవ్, రేణుకా చౌదరి, రణ్‌దీప్ సూర్జేవాలా, ఊమన్ చాందీ, అమిత్ దేశ్‌ముఖ్, రాజ్‌బబ్బర్, రమేష్ చెన్నితాల తదితరులున్నారు. 225 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి మే 12న పోలింగ్ జరుగనుండగా, 15న ఫలితాలు వెలువడతాయి.
ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, 2019లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని చిరంజీవి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు.. చిరంజీవిని హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రుద్రరాజును అబినందించిన చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more