Madras High Court halts plant expansion తూత్తకూడిలో అమరుల విజయం.. హైకోర్టు సంచలన అదేశం..

Thoothukudi madras hc stays further expansion by sterlite copper smelter

anti-sterlite protests, madras high court, thoothukudi martyrs victory, stay order, sterlite copper, sterlite copper protests, thoothukudi protests, tuticorin protests, m k stalin, rahul gandhi, rajni kanth, kamal hassan, tamilnadu

The Madurai bench of the Madras High Court has passed an interim order in connection with allegations of Sterlite operating a second unit in Thoothukudi by violating the Environmental Protection Act of 1986.

తూత్తకూడి అమరుల విజయం.. మద్రాసు హైకోర్టు సంచలన అదేశం..

Posted: 05/23/2018 12:42 PM IST
Thoothukudi madras hc stays further expansion by sterlite copper smelter

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో వేదంత పరిశ్రమకు చెందిన కర్మాగారం విస్తరణ పనులపై ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు స్టే విధించింది. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో న్యాయసమ్మతమైన డిమాండ్ ను ప్రభుత్వానికి విన్నవించినా.. వారు విస్మరించిన క్రమంలో విస్తరణ పనులను నిలిపివేయాలని స్థానికులు చేపట్టిన ధర్నా కాస్తా హింసాత్మకంగా మారి 11 మంది అసువులు బాయగా, ఇవాళ ఆ సంఖ్య 12కు చేరింది. రణరంగంగా మారింది.

అక్కడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్నివిస్తరించాలని జరుగుతున్న యత్నాలను నిరసిస్తూ ప్రజలు జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఈ పరిశ్రమ వ్యవహారమై వచ్చిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం పరిశ్రమ విస్తరణ పనులపై స్టే విధించింది. వేదంత పరిశ్రమ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986ను తూత్తుకుడిలో ఉల్లంఘిస్తూ స్టైరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను చేపడుతుందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. ఈ పనులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మధురైలోని మద్రాసు హైకోర్టు న్యాయస్థానం బెంచీ ఈ మేరకు తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

నాలుగు మాసాల్లో స్థానికుల అభిప్రాయాలను తీసుకున్న తరువాత కానీ ఈ పరిశ్రమ ఏర్పాటుకు, విస్తరణకు కానీ పర్యావరణ అనుమతులను ఇవ్వకూడదని ఈ సందర్భంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం కేంద్రానికి అదేశాలను జారీ చేసింది. పరిశ్రమ విస్తరణ చేపట్టనున్నారా లేదా అన్నది సెప్టెంబర్ మాసంలోగా తెలియజేయాలని కూడా న్యాయస్థానం అదేశించింది. ఇక వేదాంత పరిశ్రమ యాజమాన్యం కూడా మరోమారు పర్యావరణ పరిరక్షణ అనుమతుల కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పాత పరిశ్రమ ఏర్పాటుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులు విస్తరణ చేసే రెండో యూనిట్ కు వర్తించవని స్పష్టం చేసింది. పరిశ్రమ విస్తరణకు సంబంధించి అర్ ఫాతిమా అనే తూత్తుకుడి వాసి ఈ మేరకు మధురైలోని మద్రాసు హైకోర్టు బెంచీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులే కావచ్చు.. కానీ ఇవే శాశ్వత ఉత్తర్వులుగా కూడా మారవచ్చునని అమె చెప్పారు. ఇది తూత్తుకుడి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను బలి చేసిన అమరవీరుల విజయమని అమె పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sterlite  protests  plant  thoothukudi  martyrs victory  madras high court  stay order  tamil nadu  

Other Articles