pawan demand to declare health emergency ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం.. 48 గంట్లలో స్పందించకపోతే దీక్ష

Pawan kalyan deadline to ap govt appoint health minister

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan issues deadline to Andhra pradesh government to atleast appoint health minister for the state, or else will go for one day fast.

ITEMVIDEOS: ఏపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్.. 48 గంట్లలో స్పందించకపోతే దీక్ష

Posted: 05/23/2018 02:03 PM IST
Pawan kalyan deadline to ap govt appoint health minister

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి తీసుకువచ్చిన టీడీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వానికి ఆయన 48 గంటల డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వం ఈ సమస్యపై 48 గంటల్లో స్పందించని పక్షంలో తాను ఉత్తరాంధ్ర పోరాటయాత్ర మాని దీక్షను చేపడతానని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతూ, సమస్యలను ఎదుర్కొంటు వాటిని తాను దృష్టికి తీసుకువెళ్లినా.. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి పనైందని అనిపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చిత్తశుద్దితో సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని అరోపించారు.

ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటిస్తున్న ఆయన, ఉద్దానం కిడ్నీ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాలపై ప్రజలు చెప్పుకుందామంటే రాష్ట్రానికి వైద్యశాఖ మంత్రి కూడా లేరని మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రభుత్వం, పేదల కన్నీళ్లను తుడవలేకపోతోందని పవన్ విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవలేని అధికారం మీకెందుకని ఆయన ప్రశ్నించారు.

నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసిన ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై తాను ఎంతో కాలంగా పోరాడుతున్నానని, ఈ విషయంలో చంద్రబాబును స్వయంగా కలిసినా, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని ధవ్జమెత్తారు. 48 గంటల వ్యవధిలో ప్రభుత్వం అరోగ్యశాఖ మంత్రిని నియమించని పక్షంలో తాను దీక్ష చేపడతానని హెచ్చరించారు.

ఇది ప్రజారోగ్య సమస్య. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిపై అధ్యయనం చేస్తున్న స్థానిక వైద్యుల బృందంతో కలసి చర్చించి చర్యలు చేపట్టాలని, అందరూ కలసి ఏకీకృత విధానంతో ముందుకుసాగితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇక్కడ రాజకీయాలకు తావు ఉండకూడదని పవన్ సూచించారు. తాను ఏళ్ల క్రితం సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చినా.. ప్రభుత్వం మనస్సు ఎందుకు కరగడం లేదో అర్థం కావడం లేదని పవన్ కల్యాన్ అందోళన వ్యక్తం చేశారు.

ఉద్దానం సమస్యపై తాను అమెరికా డాక్టర్లను ఇక్కడకు పిలిపించి వారితో చర్చించినప్పుడు వారు అందరికీ డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. అంతకన్న ముఖ్యంగా అందిరికీ స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించాలని అసలు వ్యాధి ఎందుకు వస్తుందని దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయ్యోచ్చని తెలిపారని అన్నారు. అయితే ఇందుకుగాను 150 నుంచి 200 కోట్ల రూపాయలతో రీసర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వచ్చంధంగా వచ్చి రీసర్చ్ చేస్తామని చెప్పారని కూడా పవన్ తెలిపారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధానం కొరవడి అది కిడ్నీ బాధితులకు శాపంగా పరిణమంచిందని అన్నారు.

ఉద్దానం ప్రాంతంలోని ఏ మండలాల్లో ఈ వ్యాధి సోకుతుందని దీనిని ప్రత్యేక మెడికల్ ప్రాంతంగా పరిగణించాలని పవన్ డిమాండ్ చేశారు. ముక్కుపచ్చలారని చిన్నబిడ్డలు చనిపోతున్నారని ఆయన అవేదన్ వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు ముందుగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని స్థానిక వైద్యులు తెలిపినా ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని అన్నారు. అరకొరగా డయాలసిస్ కేంద్రాలను పెట్టి చేతులు దులిపేసుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అసలు డయాలసిస్ వరకూ రోగులను రానివ్వడం ఏంటని, ముందే మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

అక్కడి వరకు రోగులు వస్తున్నారంటే అది ఉద్దానం ప్రజల రౌర్భాగ్యమని, రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యమని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది బాధల్లో ఉంటే పాలకులకు తిండెలా దిగుతుందని అన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పాలకులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఇది ప్రజల దౌర్భాగ్యమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ జబ్బుపై స్థానిక వైద్యులు ఎంతో వ్యయప్రయాసలకొర్చి దీనిని వెలుగులోకి తీసుకువచ్చారని వారిందరికీ తన పార్టీ ధన్యవాదాలు చెబతుందన్నారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం మాత్రమే అవిర్భవించింది కాదని, ప్రజాసమస్యలకు శాశ్వాత ప్రతిపాదికన పరిష్కారం చూపించే విధంగా వుండాలని కోరుకుంటున్న పార్టీ అని పవన్ కల్యాన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  gangavaram  ichchapuram  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles