టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఓ యువతి నానా యాగీ చేసింది. నాగార్జున తనకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా రభస చేసింది. అయితే ఎందుకని ఇవ్వాలన్నది మాత్రం చెప్పలేదు. తనను లోపలికి పంపితే నాగార్జునే ఎందుకివ్వాలన్నది చెబుతారని ఎదురుచెప్పింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ క్రితం రోజు రాత్రి జూబ్లీహిల్స్ కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లింది. తాను నాగార్జునను కలవాలని అనుకుంటున్నట్టు నాగార్జున వ్యక్తిగత కార్యదర్శికి చెప్పి లోపలికి పంపించాల్సిందిగా కోరింది. నాగార్జున లేదరని అయితే సార్ ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో చెబితే.. ఆయన వచ్చిన తరువాత చెప్పి.. నాగార్జున అనుమతితో మిమ్మల్ని సంప్రదిస్తామని ఫీఏ సమాధానం ఇచ్చారు.
అంతే విజయ నోటి వెంట వచ్చిన సమాధానం విన్న నాగార్జున పిఏ విస్తుపోయాడు. నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. బంధువులకు సమాచారం అందించి అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more