Alert motorman averts bigger mishap in Mumbai లోకో పైలట్ సమయస్ఫూర్తికి.. రూ. 5లక్షల నజరానా..

As mumbai bridge collapsed alert train driver braked just in time

Mumbai bridge collapse, Andheri bridge collapse, Mumbai trains, Mumbai local trains, Piyush Goyal, train driver, motorman, Andheri railway station, piyush goyal, motorman, local train, foot overbridge, Churchgate-Dahanu, chandrashekhar sawant, Andheri

motorman Chandrashekhar B Sawant has averted a tragedy when he immediately stopped his train metres away from a place where part of a bridge had collapsed in suburban Andheri.

లోకో పైలట్ సమయస్ఫూర్తికి.. రూ. 5లక్షల నజరానా..

Posted: 07/04/2018 12:01 PM IST
As mumbai bridge collapsed alert train driver braked just in time

రైలు డ్రైవర్ (లోకో పైలెట్) కు సమయస్ఫూర్తి, అప్రమత్తతతో వ్యవహరించిడం వల్ల అటు పాదచారులు, ఇటు ప్రయాణికుల ప్రాణాలతో వున్నారనే చెప్పాలి. తమిళనాడులో పేపర్ చదువుతూ ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా రైలు డ్రైవర్ కూడా ఏమరపాటును కనబర్చివుంటే ఊహించడానికే కష్టమైన పెను ప్రమాదం సంభవించి వుండేది. కానీ ఆ రైలు డ్రైవర్ అకుంఠిత దీక్షతో విధులు నిర్వహించబట్టి ప్రయాణికులందరూ క్షేమంగా వున్నారు. అదే రైలు డ్రైవర్ ఆలోచించడం ఒక్క క్షణం లేటైనా, నిర్ణయం తీసుకోవడంలో క్షణకాలం ఆలస్యమైనా పెను ప్రమాదమే జరిగి ఉండేది.

ముంబైలోని అంధేరీ ఈస్ట్, అంధేరీ వెస్ట్‌లను కలిపే వంతెన నిన్న ఉధయం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో స్టేషన్ లోని  ఓవర్ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో పట్టాల పైకి లోకల్ ట్రైన్ దూసుకొస్తోంది. ప్రమాదాన్ని ముందే శంకించిన లోకో పైలెట్ చంద్రశేఖర్ సావంత్ క్షణంలోని పదో వంతులో ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అంతే.. ప్రమాద స్థలానికి కొద్ది దూరం ముందు రైలు ఆగింది. లేదంటే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి.  

ఈ ఘటనపై సావంత్  మాట్లాడుతూ.. బ్రిడ్జిలోని ఓ భాగం కూలిపోవడాన్ని తాను గమనించానని, రైలు కనుక మరికొంత ముందుకు వెళితే ప్రమాదమని భావించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించానని వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిన సావంత్‌కు ప్రయాణికులు అభినందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విషయం తెలిసి సావంత్‌ను మెచ్చుకున్నారు. అతడి సమయస్ఫూర్తికి అభినందనలు తెలిపారు. అంతేకాదు, రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles