Rahul Gandhi winks after hugging PM Modi in Lok Sabha పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

no trust vote, no confidence motion, Raffle scam, Rahul gandhi, PM Modi, jadoo ki jhappi, Sumitra Mahajan, BJP, france president, reliance, Rakesh Singh, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

In a much unexpected gesture, Gandhi after ending his speech walked up to the Prime Minister. They hugged each other, and as Gandhi was returning to his seat, Prime Minister Modi was seen calling him back and they exchanged pleasantries. The gestures seemed to ease the tempers.

పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

Posted: 07/20/2018 04:38 PM IST
Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన కొనసాగిస్తున్నామని చెబుతూనే అమిత్ షా నోట్ల రద్దు తరువాత చేసిన మార్పిడి, అయిన కుమారుడు జైషా సంస్థకు చేరిన కొట్ల రూపాయల లాభాలను అక్రమంగా వచ్చాయని అరోపించిన ఆయన తనను తిట్టినా ప్రధానిపై, బీజేపిపై తనకు కోపం లేదని, వారిపై తనకు ప్రేమే వుంటుందని చెప్పారు.

ఆ ప్రేమ పేరే భారత దేశమని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపి, ఆరెస్సెస్ నేతల మనసుల్లో తనపై ద్వేషం ఉంటుందని అన్నారు. తనను పప్పు అని పిలవాలని, ఇంకా ఎన్నో మాటలు అనాలని మీకు ఉంటుందని... కానీ, తన మనసులో మాత్రం ఏమాత్రం ద్వేషం ఉండదని చెప్పారు. ఆ తరువాత తన ప్రసంగం మధ్యలో.. తనకు కేటాయించిన స్థానాన్ని వదిలి వెళ్లిన రాహుల్.. అదే సభలో వున్న ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళ్లి.. ఆయనకు కౌగలించుకున్నారు.

బాలీవుడ్ లో సంజయ్ దత్ నటించిన హిట్ చిత్రంగా నిలిచిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ తరహాలో ప్రధానికి నిండుకొలువులో జాదూకా జప్పీ ఇచ్చి.. తన చర్యలతో మున్నాభాయ్ సినిమాను గుర్తుచేశారు రాహుల్. రాహుల్ చర్యతో ఒక క్షణం మోదీ నిశ్చేష్టుడయ్యారు. వెంటనే రాహుల్ చేతిని అందుకుని, భుజం తడుతూ ఆయనను అభినందించారు. ఈ ఘటనతో లోక్ సభలో నవ్వులు విరబూశాయి. సభ్యులంతా బల్లలు చరుస్తూ, ఆనందం వ్యక్తం చేశారు. ఆ తరువాత రాహుల్ ఏకంగా తన కన్నుగీటి ప్రియా వారియర్ ను కూడా గుర్తుచేశారు. తనను అభినందిస్తున్న తొటి కాంగ్రెస్ ఎంపీలకు ఆయన తన హర్షాన్ని కన్నుగీటి చెప్పడంతో.. అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : no confidence motion  congress  Rahul gandhi  PM Modi  jadoo ki jhappi  Sumitra Mahajan  

Other Articles