sexually assault: waitress thrashes man తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

Waitress thrashes man for sexually assault in restaurant

Waitress beating up a man, waitress thrashes man, sexual assault on waitress, waitress groped, waitress grop butt, waitress grab, waitress, cctv footage, grop, savannah, vinnie van, gogo restaurant, america, New Videos, Youtube, Google, Facebook, CCTV, Caught On Camera, Caught On Tape, Viral Videos, sexual assault, arrest, family, restaurant, grab, grope, beat, Crime

Waitress beating up a man who groped her butt as he walked by in an outdoor restaurant. Later the man was arrested in front of his family as reported

ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

Posted: 07/20/2018 05:15 PM IST
Waitress thrashes man for sexually assault in restaurant

తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఆమె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తాము గౌరివించినంత సేపే మహిళమని, ఎదురుతిరుగితే అపర కాళీకాదేవీలం అవుతామని ఓ మహిళ చూపించిన ధైర్యసాహసాలు…. ఆడవాళ్లను టచ్ చేయాలనుకునే వారి గుండెళ్లో గుబులు పుట్టిస్తుంది.

అమెరాకాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఓ ఘటన తాలుకు దృష్యాలు అక్కడే వున్న సీసీటీవీలలో నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఎప్పుడు.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని సావన్నాలో విన్నీ వాన్ గోగో రెస్టారెంట్‌ లో ఓ వెయిట్రెస్ కస్టమర్లకు సర్వ్ చేస్తున్న సమయంలో ఓ కస్టమర్ ఉద్దేశ్యపూర్వకంగానే వెయిట్రస్ వెనుక టచ్ చేసుకుంటూ వెళ్లాడు. ఎదో తాకినట్లు అనిపించిన అమె వెంటనే వెనక్కు తిరిగి చూసింది. ఒక వ్యక్తం రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తూ.. అమెను తాకరాని చోట తాకినట్లు గుర్తించింది.

వెంటనే స్పందించిన అమె.. ఏమీ జరగనట్టు బయటకు వెళ్లిపోతున్న ఆయనవెళ్లి అతడి వెనక్కి లాగి కిందపడేసి చితక్కొట్టింది. చేసేందేం లేక ఆమె చేతిలో దెబ్బలు తింటూ చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో అతడి భార్యా, పిల్లలు కూడా రెస్టారెంట్ లో ఉన్నారు. పక్కనే భార్యా, పిల్లలను పెట్టుకొని కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తావా అంటూ అక్కడున్న వారందరూ కూడా అతడిని తిట్టిపోశారు. జూన్-30, 2018న జరిగిన ఈ ఘటనంతా రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.  సీసీ పుటేజి ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ యువతి దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : waitress  cctv footage  grop  savannah  vinnie van  gogo restaurant  america  crime  

Other Articles