twist in techie prashanth suicide case ప్రశాంత్ జీవితంలో చిచ్చుపెట్టిన సతి అక్రమ సంబంధం

Wife illicit affair lead techie prashanth to commit suicide

tirunagari prashanth, kamareddy prashanth, warangal pavani, software engineers, extra marital affair, illicit affair, third person, suicide note, hyderbad, bangalore, padmaja mansion, srinagar colony, panjagutta police, hyderabad police, Telangana, crime

Twist in Telangana techie prashanth suicide case is revealed as he called up his brother in law week days before his suicide and said that his wife extra marital affair is making him ashamed.

ప్రశాంత్ జీవితంలో చిచ్చుపెట్టిన సతి అక్రమ సంబంధం

Posted: 10/30/2018 03:53 PM IST
Wife illicit affair lead techie prashanth to commit suicide

భార్య ప్రవర్తనతో పరువు పోతోందని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రశాంత్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి వారం రోజుల ముందు ప్రశాంత్ తన బావతో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. బావ సలహా మేరకు ప్రశాంత్ తన భార్యను ఉద్యోగ రీత్యా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పంపించాడని తెలుస్తోంది. అయినా ఆమె మరో వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండడంతో ప్రశాంత్ జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం అవుతోంది.
 
కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్‌(34)కు 2014లో వరంగల్‌కు చెందిన పావనితో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావడంతో శ్రీనగర్‌ కాలనీలోని పద్మజ మ్యాన్షన్‌లో నివాసం ఉంటూ ఎవరి కార్యాలయానికి వారు వెళ్లి వస్తుండేవారు. కొంతకాలంగా వారికి పిల్లలు కలగలేదు. క్రమంగా వారి మధ్య మనస్పర్థలు, కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోందని గుర్తించాడు. ఈ విషయమై ఆమెను మందలించాడు.

సత్వహాగా భర్త మందలింపుతో తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన పావని.. అందుకు భిన్నంగా వ్యవహరించింది. తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోకపోగా ప్రశాంత్ పైకి తిరగబడింది. అతన్ని తిట్టడంతో పాటు భర్తకు తన ప్రవర్తన నచ్చకపోతే ఎందుకు బతికున్నావంటూ.. చచ్చిపో అంటూ వేధించింది. దీంతో ప్రశాంత్ తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు. తన భార్య అక్రమ సంబంధం నలుగురికి తెలిస్తే తాను ఆ అవమాన భారం భరించలేనని భావించిన ప్రశాంత్ ఇంట్లోనే ఫ్యాన్‌ కొక్కీకి తాడుతో ఉరేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకోకముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోందని, చాలాసార్లు మందలించినా ఖాతరు చేయకపోగా తనను చచ్చిపో అంటూ దూషించిందని నోట్లో పేర్కొన్నాడు. సూసైడ్‌ నోట్ ను పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ మహ్మద్‌ జాహేద్‌ తెలిపారు. సూసైడ్‌ నోట్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ కు పంపించామన్నారు. కాగా ఈ లోగా అడియో కూడా బయటపడటంతో ఈ ఆత్మహత్య వెనుక కారణాలు అదేనని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles