mothkupalli narsimlu attack at aleru మోత్కుపల్లిపై దాడి.. రోడ్డుపై బైఠాయించి నర్సింహులు నిరసన

Mothkupalli narsimlu attack at yadagiri gutta by congress men

telangana TDP, senior leader mothkupalli narsimlu, mothkupalli narsimlu attacked, mothukupalli attacked, former minister mothukupalli narsimlu, aleru assembly constituency, Bahujan left front party, congressmen, Telangana, politics

After resigning from telangana TDP party senior leader and former minister mothukupally narsimlu is contesting from aleru assembly constituency from Bahujan left front party was attacked by congressmen.

మోత్కుపల్లిపై దాడి.. రోడ్డుపై బైఠాయించి నర్సింహులు నిరసన

Posted: 10/30/2018 08:45 PM IST
Mothkupalli narsimlu attack at yadagiri gutta by congress men

తెలంగాణ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై దాడి జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న ఆయనపై ఈ దాడి జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. మోత్కుపల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ అనుచరులు మోత్కుపల్లిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

ఈ సారి ఎన్నికలలో యాదాద్రి జిల్లా అలేరు నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలివడంతో ప్రచారం చేసుకుంటున్నానని, అదే సమయంలో అటుగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని మోత్కుపల్లి తెలిపారు. ఈ సమయంలో కార్యకర్తలతో పాటు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ టిక్కెట్ అశావహుడు భిక్షమయ్య గౌడ్ అక్కడే వున్నా.. తన అనుచరులను వారించే ప్రయత్నం చేయలేదని మోత్కుపల్లి పేర్కోన్నారు.

దీంతో తనపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వారి నాయకుడు భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి డిమాండ్ చేశారు. తనపై జరిగిన దాడికి నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భిక్షమయ్య గౌడ్ ఈ సారి తనకే టిక్కెట్ లభిస్తుందని ఓ వైపు ప్రచారం చేసుకుంటున్న క్రమంలో మోత్కుపల్లి తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందునే ఈ దాడి జరిగిందని తెలుస్తుంది.

ఈ ఘటన జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈ రోజు చోటుచేసుకుంది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఆలేరులో పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలేరులో బీఎల్ఎఫ్ టికెట్ పై పోటీ చేయడం ఖరారైపోయింది. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రచారంలో ఎదురుపడటంతో మోత్కుపల్లి వర్గీయులపై భిక్షమయ్యగౌడ్ వర్గీయులు దాడిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mothkupalli Narsimlu  attack  bahujan left front  congress  telangana  politics  

Other Articles