Pakistani jets turned back due to size of IAF భారత యుద్దవిమానాలను చూసి తోకముడిచిన పాక్

Surgical strike 2 pakistani jets turned back due to size of iaf formation

pakistan, pak army on surgical strike, pak on surgical strike, loc attack, india attacks pakistan, surgical strike, loc, india pakistan loc, india conducts surgical strike, indian air force attack on pakistan, india attack on pakistan, indian air force, mirage 2000 india air force, india pakistan news, indian air force news, india attack on pakistan today, india pakistan attack, indian air force aerial strike, latest news, india attack on pakistan today, india pakistan latest news, Politics

Pakistani F16s were scrambled to retaliate against IAF Mirage 2000s that bombed terror targets across LoC but turned back due to size of Indian formation, claimed ANI quoting IAF sources.

భారత యుద్దవిమానాలను చూసి తోకముడిచిన పాక్

Posted: 02/26/2019 12:36 PM IST
Surgical strike 2 pakistani jets turned back due to size of iaf formation

భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు పాక్‌ సైన్యం ధ్రువీకరించింది. పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ దాడులపై స్పందించారు. భారత విమానాలను తిప్పికొట్టినట్లు ఆయన వాదిస్తున్నారు.‘‘ముజఫరాబాద్‌ సెక్టర్‌లోకి భారత వాయుసేన చొచ్చుకువచ్చింది. పాక్‌ వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టింది. అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు’’ అని పాక్‌ ఐఎస్‌పీఆర్‌ డీజీ మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

ఆ దేశ విదేశాంగ, రక్షణ శాఖలు ఓ ప్రకటన విడుదల చేస్తూ, భారత విమానాలు నిబంధనలను ఉల్లంఘించి తమ సరిహద్దుల్లోకి వచ్చిన మాట వాస్తవమేనని, వాటిని వెంటనే తమ రక్షకదళాలు తిప్పికొట్టాయని ప్రకటించింది. భారత విమానాలు తమ భూభాగంపై బాంబు దాడులు చేయలేదని తెలిపింది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, భారత ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది.

అయితే పాకిస్థాన్ అర్మీ వర్గాలు చెబుతున్న దాంట్లో ఎలాంటి నిజం లేదని విశ్వాసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. భారత్ వాయుసేన దాడిని ప్రతిఘటించేందుకు పాక్‌ యత్నించినప్పటికీ మన వాయుసేన బలగాన్ని చూసి తోకముడిచినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ఎఫ్‌ 16 విమానాలు ప్రతిదాడికి దిగినప్పటికీ.. మిరాజ్‌ 2000 విమానాలను ఎదుర్కోలేక వెనక్కి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా.. తాజా ఆపరేషన్‌ వాయు సేన పశ్చిమ కమాండ్‌ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles