పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్ ధ్రువీకరించింది. పూల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడిలో ఏకంగా 48 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా భారత్ ఇవాళ వేకువజామున దాడులు జరిపింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపామని ఈ మేరకు దాడి వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ గత రెండేళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తోందని.. బహావల్ పూర్ నుంచి వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతోందని అన్నారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేపట్టేందుకు జైషే మహ్మద్ యత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఇందుకోసం ఫిదాయిన్ జిహాదీలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాదులకు గట్టిగా బుద్దిచెప్పడంతో పాటు భారత్ పై దాడులకు పాల్పడితే పర్యావసానం ఇలాగే వుంటుందని చెప్పేందుకు ఈ దాడులు జరిపామని చెప్పారు.
ఇవాళ తెల్లవారుజామున నిఘా వర్గాల నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. జైషే మహమ్మద్ కు చెందిన అతిపెద్ద ఉగ్ర శిబిరమైన బాలకోట్ లో దాడి చేశామని చెప్పారు. ఈ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్ లు, జిహాదీలను మట్టుబెట్టామన్నారు. ఈ ఉగ్రశిబిరం జైషే అధినేత మసూద్ అజార్ బంధువైన మౌలానా యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ ఆధ్వర్యంలో నడుస్తోందని తెలిపారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని గోఖలే తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more