శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 310కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేసిన క్రైస్తవులను టార్గెట్ చేసిన ముష్కరులు.. ఆరు చర్చీలు రెండు హోటళ్లల్లో పేల్చిన బాంబులతో శ్రీలంకలో బీతావాహ వాతావరణం అలుముకున్న విషయం తెలిసిందే. వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ నెత్తుటి ఏర్లు పారించాయి. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న 290కి చేరిన మృతుల సంఖ్య ఇవాళ మరింత పెరిగి 310కి చేరకుని భయాందోళన కలిగిస్తోంది.
కాగా 310 మందిలో 39 మంది విదేశీ పర్యాటకులు వున్నట్లు శ్రీలంక అధికార వర్గాలు తెలిపాయి. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఏడుగురు జేడీఎస్ నేతల్లో నలుగురు ఈ ఘటనలో అసువుల బాసినట్లు అధికారికంగా వెళ్లడైంది. అయితే మిగిలిన ముగ్గురు కోసం అన్వేషణ సాగుతోంది. ఇక విదేశీ పర్యాటక మరణాలకు బాధ్యత వహించిన శ్రీలంక ప్రభుత్వం వారికి నష్టపరిహారంగా పదిలక్షల శ్రీలంక రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇక దహనసంస్కారణాల నిమిత్తం పదివేల రూపాయలను కూడా అదనంగా అందించనున్నట్లు ప్రకటించింది.
మరోవైపు, 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని కస్టడీకి తరలించామని... వీరంతా శ్రీలంక జాతీయులేనని శ్రీలంక పోలీస్ అధికార ప్రతినిధి ఎస్పీ రువాన్ గుణశేఖర తెలిపారు. ఇదిలా ఉంచితే, విదేశీ దౌత్యవేత్తలు, హై కమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ల గురించి వారికి వివరించడమే కాక, అంతర్జాతీయ సహకారాన్ని ఆయన కోరనున్నారు. స్థానిక టెర్రరిస్టుల వెనుక అంతర్జాతీయ ఉగ్ర సంస్థల హస్తం ఉందని శ్రీలంక రక్షణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ ఘటన దర్యాప్తు కోసం అంతర్జాతీయ సహకారాన్ని కోరనున్నామని వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more