తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్షం విద్యార్థులు బంగారు భవిత పట్ల శాపంగా మారడంతో గత కొన్నాళ్లుగా కనిపించని విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ తెరపైకి రావడం.. ఏకంగా 17 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై పలువురు ప్రముఖులు విద్యార్థుల భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తూ వారికి ధైర్యాన్ని అందిస్తున్నారు. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.
ఓ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పైన నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మెరిట్ విద్యార్థి అయినప్పటికీ పరీక్షల్లో ఓ మార్కుతో ఫెయిల్ కావడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని తనకు తెలిసిందని.. తన బంగారు జీవితాన్ని ఒక్క మార్కు మార్చేస్తుందా.? లేక తాను తీసుకున్న విపరీత నిర్ణయం మార్చేస్తుందా.? అని అమె అవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నా’ అని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.
ఇంటర్ బోర్డు వద్ద మూడంచెల భద్రత
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ భారీగా తల్లిదండ్రులు హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ‘లేదంటే మీ అందరిని అరెస్ట్ చేస్తాం’ అని హెచ్చరిస్తున్నారు.
దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ న్యాయమని నిలదీస్తున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. తాము రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more