Missing Girl Manisha Body Found In Same Well శ్రావణి శవం లభించిన బావిలోనే మనీషా అస్తిపంజరం..

Yadadri murder missing girl manisha body found in same well as sravani s

Yadadri murder case, manisha murder, manisha dead body, manisha skeleton, sravani murder, sravani dead body, sravani rape and murder, srinivas reddy, bike mechanic, hazipur, bommalaramaram, yadadri district, crime

There seems to be more to the sensational rape and murder case of 14-year old Sravani to be brushed aside as a one off incident. In a shocking development on Monday, the Rachakonda Police found another dead body of a teen girl, who was later identified as Manisha.

శ్రావణి శవం లభించిన బావిలోనే మనీషా అస్తిపంజరం.. అదుపులో నిందితుడు

Posted: 04/29/2019 05:51 PM IST
Yadadri murder missing girl manisha body found in same well as sravani s

తెలంగాణ రాష్ట్రంలో సంచలనానికి తెరలేపిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసులో దర్యాప్తులో మరో కలకలం రేగింది. పదో తరగతి విద్యార్థిని శ్రావణి మర్డర్  కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో బాలిక మృతదేహాం తాజాగా లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని మనీషా నెల రోజుల క్రితం అదృశ్యమైంది. అయితే నెల రోజుల తరువాత ఇవాళ అమె శవం లభ్యంకావడంతో హాజీపూర్ సహా పరిసర ప్రాంతాల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.

శ్రావణి హత్యాచార కేసు విచారిస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఓ అనుమానిత నిందితుడిగా వున్న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించిన క్రమంలో అతనే భావిలో మరో బాలిక శవాన్ని పూడ్చిపెట్టినట్టు పోలీసులకు తెలిపాడని సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరోమారు బావి వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మనీష మార్చిలో అదృశ్యమైంది. ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అనేది తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. చివరికి ఇలా మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు షాక్ తిన్నారు. బావిలో ఒక్కొక్కటిగా అమ్మాయిల మృతదేహాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మనీషకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి మనీష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తమ కూతురు అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. ఎప్పటికైనా ఇంటికి తిరిగివస్తుందిలే అని భావించిన క్రమంలో అమె శవమై కనిపించడంతో అమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నెల రోజులకు పైగా అమెపై అత్యాచారం, చేసి చంపి పూడ్చిపెట్టడంలో అమె శవం కోసం పోలీసులు తవ్వగా.. అక్కడ మనీషా ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని ఐదు సంచుల్లో సేకరించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని పరీక్షలు చేసి తర్వాత ల్యాబ్ కి పంపిస్తామని పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు, అక్కడ లభించిన బ్యాగు ఆధారంగా మృతదేహం మనీషదే అని పోలీసులు గుర్తించారు. సైంటిఫిక్ గా నిరూపించాల్సిన అవసరం ఉండటంతో డీఎన్ఏ టెస్టుకి ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేదా తండ్రి డీఎన్ఏతో పోల్చనున్నారు.

ఇదిలావుండగా, హాజీపూర్ గ్రామానికి చెందిన మరో యువతి కల్పన 2015లో అదృశ్యమైంది. అయితే ఈ బాలిక కూడా అత్యాచారానికి గురైందా.? అమెను కూడా నరరూప రాక్షసుడు బలితీసుకున్నాడా.? లేక అమె బతికేవుందా.? అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా కల్పన గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదిలావుండగా, హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు అనధికారికంగా నిర్థారించాయి. నిందితుడు కీసరలో బైక్ మెకానిక్ గా పనిచేస్తుంటాడని, అయితే అతనిపై హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేసులు వున్నాయని పోలీసుల రికార్డుల్లో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravani  manisha  srinivas reddy  bike mechanic  hazipur  bommalaramaram  yadadri district  crime  

Other Articles