Devotees claim they visited Amarnath, say 'Shivling' is giant అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకున్నాం: మరింత పెద్దగా హిమలింగం

Devotees claim they visited amarnath cave two months before official yatra

Amarnath Yatra, Amarnath pilgrims, Amarnath cave, Amarnath visit, Amarnath cave photos, gaint 'Shivling'

The Amarnath Yatra annual yatra is still two months away, some devotees have claimed to have visited the holy shrine in the fourth week of April. According to the pilgrims, the size of 'Shivling' is giant even this year and there is still 10-15 feet high snow present on the way to the cave.

అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకున్నాం: మరింత పెద్దగా హిమలింగం

Posted: 04/29/2019 06:37 PM IST
Devotees claim they visited amarnath cave two months before official yatra

స్వయంభూ హిమలింగం కొలువయ్యే హిమాలయ సాణువుల్లోని అమర్ నాథ్ గుహలో అనూహ్యంగా రెండు నెలలకు ముందే మంచులింగం దర్శనమిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో క్రమంగా కరిపోతూ వస్తున్న హిమలింగం.. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా అత్యంత పెద్దగా వుందని అమర్ నాథుడ్ని దర్శించుకుని వచ్చని భక్తులు ప్రకటించారు. ఈ మేరకు వారు అమర్ నాథ్ హిమలింగానికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం హిమలింగ్ పది నుంచి పదిహేను అడుగుల ఎత్తులో వుందని వారు పేర్కోన్నారు.

వాస్తవానికి శ్రావణమాస సమయంలో (అనగా జూలై నుంచి ఆగస్టు మధ్యకాలంలో) అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అయితే, కొంతమంది భక్తులు ఏప్రిల్ నాలుగో వారంలో అమర్ నాథ్ యాత్ర చేపట్టారు. స్వయంభు హిమలింగాన్ని తాము దర్శించుకున్నామని వారు పేర్కోన్నారు. తమకు 15 అడుగుల ఎత్తయిన హిమలింగం కనిపించిందని వారు ప్రకటించారు. అంతేకాదు తాము నిజమే చెబుతున్నామని, కల్పితం కాదని.. తమ యాత్ర సాగిన తీరులో అక్కడక్కడా వారు తీసుకున్న ఫోటోలను కూడా వారు విడుదల చేశారు. ఇవి నాలుగు రోజుల క్రితం తీసినవిగా తెలుస్తోంది. మొత్తం ఎనిమిది మంది ఈ నెల 20 నుంచి 25 మధ్య యాత్రను చేశామని, ఈ సంవత్సరం తొలిసారిగా స్వామిని దర్శించుకున్నది తామేనని వారు చెబుతున్నారు.

కాగా, ఈ యాత్రను ప్రతి సంవత్సరమూ ఎస్ఏఎస్బీ (శ్రీ అమర్ నాథ్ జీ షరైన్ బోర్డ్) నిర్వహిస్తుంది. ఎస్ఏఎస్బీ అధికారులే ఈ సంవత్సరం ఇంతవరకూ గుహను సందర్శించలేదు. దీంతో ఈ ఎనిమిది మంది అమర్ నాథ్ యాత్రపై అధికారిక ధ్రువీకరణ అందలేదు. 46 రోజుల పాటు సాగే అమర్ నాథ్ యాత్ర, ఈ సంవత్సరం జూలై 1న మాస శివరాత్రి నుంచి ఆగస్టు 15న వచ్చే శ్రావణ పూర్ణిమ, రాఖీ పండగ వరకూ కొనసాగుతుంది. ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంకుల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో రోజుకు 7,500 మంది యాత్రికులను ఈ సంవత్సరం అమర్ నాథ్ కు చేరుస్తామని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles