ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విపక్షాలు విమర్శలను ఎక్కు పెడుతుంటే.. జనసేన పార్టీ మరో అడుగు ముందుకేసీ ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కూడా నిర్వహించి ప్రభుత్వతీరును ఎండగట్టింది. ఈ క్రమంలో జగన్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతూన్న క్రమంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై విమర్శల దాడి కొనసాగింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు అందించే ప్రతిభా పురస్కారాల పేరు మార్పు చేపడుతూ ఓ జీవో విడుదల కావడం.. విమర్శలు దాడికి దానిని యధాతథంగా వుంచాలని అధికారులు అదేశాలు జారీ చేశారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏబిజే అబ్దుల్ కలాం పేరున వున్న ఈ అవార్డులను మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రధానం చేయడం గత రెండేళ్లుగా అనవాయితీగా వస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఉన్నత విద్యకు దోహదపడేలా స్కాలర్ షిప్ తో పాటు మెమొంటోను కూడా అ అవార్డుల సందర్భంగా ప్రభుత్వం ప్రధానం చేస్తుంది. అయితే ఈ అవార్డుల కార్యక్రమాన్ని కూడా తన తండ్రి పేరున వైఎస్సార్ విద్యా పురస్కారాలుగా మార్చుతూ జీవో విడుదలైంది. దీంతో ఈ జీవోపై అన్ని వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. తన దృష్టికి రాకుండా జీవోలను ఎందుకు విడుదల చేస్తున్నారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. అబ్దుల్ కలాం పేరు మార్పుపై అయన మండిపడ్డారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యథాతథంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని సూచించారు. మరికొన్ని అవార్డులకు మహనీయుల పేర్లు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్ పేర్లతో అవార్డులు ఇవ్వాలని జగన్ సూచించారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. నవంబర్ 11న కలాం జయంతి సందర్భంగా జరుపుకోబోయే జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డుల’ పేరును ‘వైఎస్‌ఆర్ విద్యా పురస్కార అవార్డులు’గా మార్చుతూ అధికారులు జీవో జారీ చేశారు. ఈ జీవో పెను దుమారమే రేపింది. కలాం జయంతి సందర్భంగా ఇచ్చే అవార్డులకు కూడా వైఎస్సార్ పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. సీఎం జగన్ తాజాగా ఈ ఆదేశాలిచ్చారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందన
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం' అవార్డుల పేరును వైఎస్సార్ విద్యా పురస్కారాలుగా మార్చడం విస్మయం కలిగిస్తోందన్నారు. అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారని ప్రతిభా పురస్కారాలకు ఆయన పేరు పెట్టామని.. జగన్ సర్కార్ దీన్ని కూడా మార్చడం సరికాదన్నారు. ఇది ఆయన్ను అవమానించడమేనని చంద్రబాబు అన్నారు. జీవోపై విమర్శలు రావడంతో సీఎం స్పందించారు.. జీవోను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయమని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి నారా లోకేష్ స్పందన
విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించారని, కలాంను అవమానించేలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని నారా లోకేశ్ అన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందన
ఎస్సెస్సీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారని, వీటిని రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని అబ్దుల్ కలాం పేరు పెట్టారని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. వీటికి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని అన్నారు. పేర్లను మార్చే తీరును కొనసాగిస్తోన్న ప్రభుత్వం ప్రతిభా అవార్డులను కూడా వదలలేదని విమర్శలు కురిపించారు.
బీజేపి నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ స్పందన
అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ పేరు మార్పుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం పేరుపై ఇస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైయస్సార్ గారి పేరుతో మార్పు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వైయస్సార్ ను గౌరవించుకోవాలనుకుంటే వారి పేరుపైన కొత్తగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించడం సబబని తెలిపారు. విద్యాపరమైన పురస్కారాలకు అబ్దుల్ కలాంగారి పేరే సముచితంగా ఉంటుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more