తాగు నీరు మాత్రమే దేశాల మధ్య యుద్దాన్ని తీసుకువస్తుందని వీరభ్రహ్మేంద్రస్వామి భవిష్యవాణిలో వెల్లడించారు. కానీ ఉల్లిపాయలు.. మాత్రం దేశాలకు రాజులైనవారిని కూడా వణికిస్తాయని తాజాగా ఆకాశానికి తాకిన ధరలే స్పష్టం చేశాయి. ఉల్లిధరల పెంపుపై ఎన్నో స్కిట్లు, ఎన్నో టిక్ టాక్ లు నెట్టింట్లోనూ హల్ చల్ చేశాయంటే.. అది ఉల్లి ఘాటుకు కాదు కానీ ఉల్లి రేటు మహత్యమని చెప్పక తప్పదు. అత్యంతధికంగా ధరలతో ప్రజల జేబులు గుల్ల చేసేశాయి. ఉల్లి పండించే రైతును కోటీశ్వరుడిగా సమాజం ఓ ప్రత్యేకతను కూడా కల్పించడానికి కారణమైంది.
రైతులందు ఉల్లి రైతు వేరయా అంటూ ఉల్లి రైతను రైతు సమాజం నుంచి తీసి ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టింది. ఇంతటి ప్రత్యేకత దక్కిందుకు ఉల్లికి వచ్చిన ధరే కారణమని తెలుస్తోంది. అయితే తాజాగా సంక్రాంతి పండగ నేపథ్యంలో కూడా ఉల్లికి డిమాండ్ పెరిగింది. అదెలా అంటే.. ఇక్కడ కూడా ఉల్లి పంతంగులే ఆ డిమాండ్ కు కారణమయ్యాయి. గుజరాత్ రాష్ట్రం నిర్వహించే అంతర్జాతీయ పంతంగోత్సవంలో ఉల్లి పతంగులు సందడి చేస్తున్నాయి.
గుజరాత్లోని అహ్మదాబాద్ సబర్మతి నది రివర్ ఫ్రంట్ దగ్గర పతంగోత్సవ్ ను సీఎం విజయ్ రూపాణీ ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్ లో ఉల్లి ఆకారంలో తయారు చేసిన పతంగులు గాలిలో ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ప్రతీ ఏడాది ఏదో విభిన్నత చోటుచేసుకునే ఈ పంతంగోత్సవంలో.. ఈసారి ఉల్లి పతంగులకు మరింత డిమాండ్ పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిధరను ఈ పంతంగులు ఇవి ప్రతిబింబించడంతో.. ఈ ఉల్లి పతంగులు పతంగోత్సవ్ లోని ప్రేక్షకులను విశేషంగా అకర్షిస్తున్నాయి.
పంతంగుల పెస్టివల్ లో ఎగురవేసిన అతిపెద్ద ఉల్లి పతంగు అక్కడున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పెద్ద ఉల్లిపతంగు తయారీలో వెదురు, టిష్యూను వినియోగించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఫెస్టివల్లో తొలిరోజున 43 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే మన దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 115 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బాగా హీటిక్కించించిన ఉల్లిపాయలు పంతంగుల పండుగలో కూడా నాదే పైచేయి అనడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more