కావాలి జగన్, రావాలి జగన్ అంటూ ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చి చూద్దమాంటూ వైఎస్ జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్రంలో గెలిచిన 151 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల గెలుపును కూడా నల్లేరుపై నడకగా మార్చింది కూడా ఈ నినాదమే. పలువురు ఎమ్మెల్యేలకు స్థానికంగా మంచి అభ్యర్థులని పేరుండి గెలువగా, కొందరు మాత్రం ప్రతికూలతను ఎదుర్కోన్నారు. అయినా జగన్ అనే పేరుతో వారికి ఓట్ల పడ్డాయి. అదే వారిని అధికార హోదాను కట్టబెట్టింది.
అధికారం దక్కడం ఎంత కష్టమో అర్థమైన తరువాత.. దానిని నిలుపుకోవడం కూడా అంతే కష్లమన్న విషయం కూడా నేతలకు తెలుసు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుసు. అందుకనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ తీర్చడానికి రాష్ట్ర ఖాజానా సరిపోకపోయినా.. తనదైన శైలిలో ప్రజలకు సంక్షేప పథకాలు, ఫలాలు అందాలన్న ఏకైక లక్ష్యంతో చిత్తశుద్దితో ప్రకటించిన పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకిచ్చిన హామీలు మరికొన్ని వున్నాయి.
తన అధికారంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇసుక విధానం మొదలు సంక్రాంతి పండుగ సీజన్ లో అధిక ధరలను వసూలు చేసే ప్రైవేటు బస్సులపై కూడా తమకు పిర్యాదు ఇవ్వవచ్చునని ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఇంతవరకు తమది అవినీతికి అస్కారం ఇవ్వని ప్రభుత్వమని కూడా చాటుకున్నారు. అయితే ప్రభుత్వ అధినేతగా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఎమ్మెల్యేలు మాత్రం తమది మరో దారి అంటూ అక్రమాల మార్గంలో నడుస్తూ యధేశ్చగా అవినీతి దందాకు తెరలేపుతున్నారు.
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో 1972లో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ పేరున ఏర్పడిన కాలేజీకి ఘన చరిత్రే వుంది. ఈ కళాశాలలో ఎందరో విద్యార్థులు ఉచితంగా విద్యాబుద్దులతో పాటు ఉన్నత చదువులను అభ్యసించి సమాజం గౌరవించే బాద్యాతాయుతమైన విధులను నిర్వహిస్తున్నారు. ఇంకోందరో వ్యాపార, వాణిజ్య రంగాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే ఇలాంటి కాలేజీకి ప్రస్తుతమున్న యాజమాన్యం అపఖ్యాతిని తీసుకువస్తోందా.? అంటే ఔననక చెప్పకతప్పదు.
ఈ కాలేజీలో ప్రభుత్వం కేవలం నలుగురు ఎయిడెడ్ లెక్చరర్లను మాత్రమే కేటాయించిందని, మిగతావారిని తామే ఏర్పాటు చేశామని, వారికి జీతాలను చెల్లించాలంటే ప్రతీ విద్యార్థి వారు చెల్లించాల్సిన పరీక్షా రుసుముకు అదనంగా వెయ్యి రూపాయలను చెల్లించాలని యాజమాన్యం అదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని విద్యార్థులు తమ సంఘాల నాయకులతో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో కాలేజీ కార్యదర్శిగా వున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకుని.. ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఆయన కూడా యాజమాన్యం చెప్పిన విషయాన్నే చెప్పారు. ప్రభుత్వం విధించిన తేదికి బదులు ముందు తేదీనే ఏర్పాటు చేసి... ఆ తేదీ దాటితే.. అదనపు రుసుం చెల్లించాలని షరతు విధించారన్న విషయంపై దాటవేసారు. ఇక తక్కువ హాజరు వున్న విద్యార్థుల నుంచి కూడా కాన్డోనేషన్ వసూళ్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆయన దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగా ఇక నుంచి బయోమెట్రిక్ యంత్రాలను విద్యార్థుల హాజరుపట్టిక కోసం ఏర్పాటు చేస్తున్నారని చెప్పి దాటవేశారు.
ఈ క్రమంలో పలువురు విద్యార్థులు తాము ఎస్ఎఫ్ఐ నాయకులమని చెప్పడంతో వారిపై ఒంటికాలితో లేచారు కాసు మహేష్ రెడ్డి.. తన కలాశాలలోకి విద్యార్థి సంఘాల నాయకులు ఎలా ప్రవేశించారంటూ ఫైర్ అయ్యారు. తన అనుమతి తీసుకోకుండా విద్యార్థి సంఘాల నాయకులు ఎలా ఎంటర్అయ్యారని, ఇలా ఒక నియమం కూడా వుందని ఆయన చెప్పారు. మీడియా వాళ్లు కూడా వున్నారని సిబ్బంది చెప్పగా.. ఉండని వుంటే రేపు పేపర్లో రాసేస్తారా.. రాస్తే రాసుకోని.. అంటూ మండిపడ్డారు. చూశారా.. సీఎం సారూ.. అవినీతికి అస్కారం లేకుండా మీ పాలనకు.. మీ ఎమ్మెల్యేలే బ్రేకులు ఎలా వేస్తున్నారో..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more