శంఖంలో పోస్తేకానీ తీర్థం కానట్టు.. నెట్టింట్లోనూ ఎందరో పోస్టు చేసే వీడియోలు కొందరు ప్రముఖుల నుంచి కామెంట్లు వచ్చిరావడంతోనే వైరల్ గా మారుతుంటాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఇలాంటి ఎన్నో వీడియోలో ప్రముఖుల కంట పడకుండా మరుగున పడిపోయాయి. అయితే తీరిక లభిస్తే మాత్రం ప్రముఖలు ఆ వీడియోలకు తమదైన కామెంట్లను జోడించడంతో అవి వైరల్ గా మారడం మనం చూస్తూనే వున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో పోస్టు చేసిన ఓ ఆసక్తికరమైన వీడియోను ఇలానే హల్ చల్ చేస్తోంది.
విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, భూమిని చదను చేయడానికి, ఎత్తు పల్లాలను సరిచేయడంతో పాటు ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటారు. కానీ గుజరాత్లో మాత్రం కొందరు మహిళలు దీనిని విభిన్నంగా వాడారు. ఓ చిన్న సైజు ఎలివేటర్ మాదిరిగా జేసీబి సేవలు అందించింది. అదేంటి జేసీబీ ఎంటీ..ఎలివేటర్ మాదిరిగా ఎలా.? అని విస్మయం చెందకండి. గుజారత్ లో డీసీఎం వాహనంలో ఎక్కిన కొందరు మహిళలు.. దాని నుంచి దిగడానికి వెనుకంట వేస్తున్నారు. జేసీబీ నుంచి దిగే క్రమంలో దూకాల్సివస్తుందని, ఆ సమయంలో కాలు బెణికినా.. లేక ఎలాంటి గాయాలైనా తాము బాధపడాల్సి వస్తుందని అలోచనలో పడ్డారు.
ఇంతలో అటుగా వున్న జేసీబిని చూసి దాన్ని ఎలివేటర్ మాదిరిగా ఉపయోగించుకుంటే తాము సులభంగా దిగొచ్చని భావించారు. అంతే జేసీబీని పిలిచి దాని సాయంతో డీసీఎం వ్యానులోని మహిళతు దిగారు. ఇలా దిగుతూన్న సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్ రీట్వీట్ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు.
I am sure the inventor of JCB, never visited Gujarat to even dream that one day his invention would be used like this pic.twitter.com/Hh0h1WOWE4
— Kiran Kumar S (@KiranKS) February 23, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more