పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలడం లేదు. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఆల్లర్లు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ అల్లర్లలో మొత్తం ఏడుగురు మరణించగా, సుమారు 50 మంది గాయాలపాలయ్యారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో పోలీసులు హెడ్ కానిస్టేబుల్ కూడా వున్నారు. కాగా క్షతగాత్రుల్లో పోలీసు అధికారులే అధికంగా వున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజల్ శాంతిభద్రతలను పర్యవేక్షించాలని ఢిల్లీ పోలీసులను కోరారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఢిల్లీకి చేరుకుంటారన్న కొన్ని గంటల ముందు ఈ అల్లర్లు జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక ఇవాళ కూడా ఆయన దేశ రాజధానిలోనే వుంటారన్న వార్తల నేపథ్యంలో అల్లర్లను పూర్తిగా అదుపుచేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగాయని, ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారని.. అర్ధరాత్రి వేళ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు. మంటల్ని అదుపు చేయడానికి వచ్చిన మరిన్ని అగ్నిమాపక యంత్రాలపై నిరసకారులు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం మౌజ్‌పూర్, బ్రహ్మపురి ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లురువ్వినట్లు సమాచారం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మొత్తం 150 మందికి పైగా గాయాలతో గురుతేజ్ బహదూర్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆందోళనకారుల్లో కొంతమంది తుపాకులు ఎక్కుపెట్టి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని మోహరించారు. పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఉదయం ఈశాన్య ఢిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నిరసనకారుల అందోళనల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు అందోళనకారులు నిప్పు పెట్టారు. పెట్రోల్ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more