గాయకుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై ఇటీవల పబ్ లో జరిగిన దాడి ఘటన చర్చనీయాంశమైంది. మార్చి 5వ తేదీ అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో రాహుల్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డికి మధ్య మాటామాటా పెరగడంతో అది చివరకు దాడికి దారి తీసింది. రితేష్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు బీరు బాటిళ్లతో రాహుల్ పై దాడి చేశారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ లో లభించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. సోమవారం పాతబస్తీలోని రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై దాడి చేయడం పెద్ద తప్పేనన్నారు. దాడి చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా శిక్ష పడాల్సిందే అన్నారు. రాహుల్‌కు ఎవరూ లేరనుకోవద్దంటూ తన మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. రాహుల్‌కు ఫ్యాన్స్ కూడా ఉన్నారని.. వారంతా చూస్తూ ఊరుకోరని ప్రకాష్ రాజ్ అన్నారు.
‘‘పబ్‌కు వెళ్లడం ఎవ్వరూ తప్పని చెప్పరు. కానీ, అలా బాటిళ్లతో కొట్టడం తప్పు. చంపేస్తారా ఏంటి? ఆ అహంకారం తప్పు. అసలు ఎవరిది తప్పో తెలుసుకుని భవిష్యత్తులో కూడా దీని గురించి మాట్లాడతాను. రాహుల్‌కు వెనుక నేను నిలబతాను. అతనికి ఒక ధైర్యం ఇస్తాన్నాను అంతే. రాహుల్ తప్పుచేయలేదని నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీకి చెందిన పాపులర్ పర్సన్స్‌ని ఎక్కడికిబడితే అక్కడికి వచ్చి కొట్టేస్తారా ఏంటి? ఒక్కడిని పట్టుకుని పది మంది బాటిళ్లతో కొట్టేయడమేంటి? దాన్ని చూస్తూ నిలుచోవడం తప్పు కదా’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాలో చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తూ రాహుల్ ఇంటి వద్ద ఆగానని, అతని కుటుంబంతో మాట్లాడానని చెప్పారు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం మరో కీలక పాత్ర పోషించారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా కూడా ఈ చిత్రంలో నటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more