మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్ నాథ్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చారు. ఆయనకు మద్దతు ఇస్తున్న ఆరుగురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయారు. వీరందరి ఫోన్లూ స్విచ్చాఫ్ లో ఉండటంతో కర్ణాటక తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపి బాహాటంగా ఎమ్మెల్యేలకు తాయిలాలను ముట్టజెప్పి.. అపరేషన్ అకర్ష్ కు తెరలేపిందన్న అరోపణలు గుప్పుమంటున్నాయి.
అచూకీలేకుండా పోయిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ బెంగళూరులో మకాం వేసినట్టు వార్తలు వినబడుతున్నాయి. తాజా పరిస్థితితో దేశరాజకీయాల్లో మరోమారు వేడి పుట్టింది. సంక్షోభంలో పడిన సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇదే క్రమంలో జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు వచ్చారు. అయితే అమె మాత్రం సింధియాను కలవకూడదనే నిర్ణయించుకుని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్ష్ోభం నేపథ్యంలో సోనియాను కలసి అన్ని విషయాలు వివరించాలని అనుకున్నారని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్వల్ప మోజారిటీతో గెలిచింది. అయితే ముఖ్యమంత్రి పదవిని అకాంక్షించిన సింధియాకు భంగపాటు ఎదురైంది. ఆయనకు కాకుండా సీనియర్ నేతైన కమల్ నాథ్ కు ఆ పదవిని కట్టబెట్టి.. సింధియాకు ఉపముఖ్యమంత్రి పదవిని కల్పించింది. అయినా ఆ పదవితో సంతోషించని సింధియా అప్పటి నుంచి అసమ్మతి సెగను రాజేస్తూనే వున్నారని సమాచారం. దీంతో అవకాశం కోసం వేచి చూస్తున్న ఆయనకు బీజేపీ గాలం వేసిందని.. దానికి ఆయన చిక్కకుని ఆయన వర్గం ఎమ్మెల్యేలతో షాకిచ్చారు.
సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్వత్వం తీసుకుంటారని, అనంతరం కేంద్రమంత్రి పదవి కూడా చేపడతారన్న వార్తలు జోరుగా షికారుచేస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాబోతోందని కాంగ్రెస్ ముందుగానే ఊహించినట్టు ఇటీవల ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కమల్‌నాథ్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more