Amid coronavirus, what is the ideal AC temperature? కోవిడ్-19: ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడకంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు

Covid 19 government guidelines on acs coolers and fans

ac, ideal ac temperature, ac coronavirus, air cooleres, fans, refrigerators. coronavirus, Government Guidelines, Indian Society of Heating Refrigerating and Air Conditioner Engineers, ISHRAE, ventilation control, residences, work spaces, healthcare facilities, cooler temperature, air condition tenperature, AC temperature Covid, ac temperature, AC guidelines Covid

As the temperatures soar towards 40s, people need to use air conditioners (AC) and dessert coolers to get some respite from the scorching heat. However, there have been many concerns over the use of ACs and coolers, and also over what temperature they need to be used in, amid the coronavirus pandemic.

కోవిడ్-19: ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడకంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు

Posted: 04/25/2020 10:36 PM IST
Covid 19 government guidelines on acs coolers and fans

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేయాలంటే అత్యధిక ఉస్ణోగ్రతలు దోహదం చేస్తాయన్న వార్తలు మొదట్లో తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అధ్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లోనూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని చాటుతుందని కూడా వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను దేశ ప్రజలకు జారీ చేసింది. అద్యధిక ఉష్ణోగ్రతల్లో వైరస్ తన ప్రభావాన్ని చాటలేదని పలు అధ్యయనాలు చేసిన సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు తాజా గైడ్ లైన్స్ ను జారీ చేసింది.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అనేక మంది తమ ఇళ్లలోని ఏయిర్ కండీషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత వినియోగించనున్నారని తెలిపింది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం, ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది.

ఎయిర్ కండిషనర్లు

* తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి.
* పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు.
* పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు.
* ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది.
* ఏసీలు వాడుతున్నప్పుడు.. కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి.

కూలర్లు

* పరిశుభ్రమైన గాలి ప్రసరించేలా కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి.
* ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి.
* ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.
* కూలర్లను వినియోగిస్తున్న సమయంలో కిటికీలు తెరిచే ఉంచాలి.
* పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించవు కాబట్టి వీటి వాడకాన్ని నిరోధించాలి.

ఫ్యాన్లు

* ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి.
* సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉంటే మరీ మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles