రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్ ప్రారంభమైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంపై ఆమె అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా 53,10,543 జవాబు పత్రాల మూల్యాకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
లాక్ డౌన్ తో వాయిదా పడిన ఇంటర్మీడియట్ మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ విద్యార్థులు 861 మంది ఉన్నారని, ఆ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 స్పాట్ కేంద్రాల ఏర్పాటు చేశామని, 33 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అన్నింటా భౌతిక దూరం పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 600 నుంచి 700 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా కారణంగా నిలిపిన పదో తరగతిపరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 2,530 పదో తరగతి పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చేసే ఏర్పాట్లపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. పరీక్షకేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజూ కేంద్రాల్లో కెమికల్ శానిటైజేషన్ చేస్తామన్నారు. బెంచ్ కు ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు చేపడతామన్నారు. పరీక్షల నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అంశంపై లాక్ డౌన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది ఫీజులే ఈ ఏడాది వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు, నెల వారీగా ఫీజులు తీసుకోవాలన్నారు. ఫీజులపై ఒకట్రెండు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా ఇతర బోర్డులకు కూడా ఈ అదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఫిర్యాదులు స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు సబితారెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more