Coronavirus: India starts clinical trial of Ashwagandha కరోనా వైరస్ ప పోరుకు అయుర్వేద మూలికతో క్లినికల్ ట్రయల్స్

Covid 19 govt to conduct randomised controlled clinical trial of ashwagandha

Coronavirus, clinical trial of Ayush medicines, traditional medicines, Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Dr Harsh Vardhan, Ayush-64, CISR, ICMR, Covid-19

The government will conduct a randomised controlled clinical trial to assess the efficacy of ayurvedic drug ashwagandha as a preventive intervention among healthcare professionals and high-risk COVID-19 population in comparison with hydroxychloroquine.

కరోనా వైరస్ ప పోరుకు అయుర్వేద మూలికతో క్లినికల్ ట్రయల్స్

Posted: 05/07/2020 10:01 PM IST
Covid 19 govt to conduct randomised controlled clinical trial of ashwagandha

కరోనావైరస్ పై యుద్దానికి సనాతన అయుర్వేద ఔషద గుణాలు కలిగిన మూలికల సాయం కూడా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దేవతల వైద్యుడు ధన్వంతరి నుంచి హిందువులకు అందిన ఆయుర్వేద వైద్యంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు నయం చేసేందుకు దోహదపడుతుందా.?. అన్న అంశం ధిశగా భారతీయు శాస్త్రవేత్త మండలి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ పలువురు వైద్యరంగ నిష్ణాతులతో సమావేశం అయిన సందర్భంగా ఆయన వారికి ఇదే విషయాన్న సూచించారు. దీంతో భారతీయ శాస్త్రవేత్తలు ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

హైడ్రాక్సీ క్లోరిక్విన్ తో పోలిస్తే కొవిడ్‌-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో ఎంత సమర్థంగా పనిచేయనుందో భారతీయ శాస్త్రవేత్తల మండలి అధ్యయనం చేయనుంది. సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక సిబ్బంది, ఐసీఎంఆర్‌ సహాయంతో ఆయుష్‌, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. స్వల్ప, మరికాస్త ఎక్కువ లక్షణాలున్న కొవిడ్‌-19 రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి+పిప్పలి, పాలీ హెర్బల్‌ ఫార్మలేషన్‌ (ఆయుష్‌-64)ను ఇస్తారని ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచా తెలిపారు.

ఆయుష్‌-64ను మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. ‘ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా, వస్తే నియంత్రించేందుకు ఆయుర్వేద ఔషధాల ప్రయోజనాలను నిర్ధారించేందుకు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ఉపయోగపడతాయి’ అని కొటెచా వెల్లడించారు. కొవిడ్‌-19 నియంత్రణకు ఆయుష్‌ సలహాలను స్వీకరించాలనుకునే వారి అంగీకారం కోసం ‘సంజీవని’ మొబైల్‌ యాప్‌ను మంత్రి హర్షవర్దన్‌ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయుష్‌ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 లక్షల మందిని చేరుకొనేలా ఈ యాప్‌ను రూపొందించారు. కొవిడ్‌-19 అంతమయ్యాకా ఆయుష్‌ ప్రయోజనాలు కొనసాగేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని హర్షవర్దన్‌ అన్నారు. ఇతర చికిత్సా పద్ధతులకు ఆయుష్‌ మద్దతుగా నిలిచి బలం పెంచుతుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles