దాయాధి దేశం పాకిస్థాన్ లో ఇద్దరు భారత్ దౌత్య అధికారులు అదృశ్యమయ్యారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు అదృశ్యం కావడం ఇప్పడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు భారత దౌత్య అధికారుల మిస్సింగ్ గురించి పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ విషయాన్ని పాకిస్థాన్ యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం నుంచి వారు కనిపించకుండా పోయారని వార్తలు వస్తున్నప్పటికీ.. వాస్తవానికి వారు ఎప్పట్నించి కనించడం లేదన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.
గతంలో భారతీయ రాయబార కార్యాలయానికి చెందిన అధికారులపై వేధింపులకు పాల్పడిన చరిత్ర పాకిస్థాన్ కు వుంది. గతంలో కారులో ఇంటికి వెళ్తున్న భారత దౌత్యఅధికారి గౌరవ్ అహ్లువాలియాతో సహ మరికొందరిని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ద్విచక్ర వాహనాలపై వెంబడించి వేధింపులకు గురిచేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియాలోనూ వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి, ఇదే తరుణంలో ఇప్పుడు మరో ఇద్దరు భారత రాయభార కార్యాలయానికి చెందిన అధికారులు కనిపించకుండా పోవడంపై అలాంటి చర్యలే ఏమైనా జరిగాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే ఇవి ఖచ్చితంగా భారతపై జరుగుతున్న వ్యతిరేక చర్యలు, కక్షసాధింపు చర్యల్లోనే భాగంగా సాగుతున్నాయని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదానికి స్వర్గధామంగా నిలచిని పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలన్ని కర్నార్ చేస్తున్న తరుణంలోనూ దాయాధి దేశం తమ అరచకాలను అడ్డుఅదుపులేకుండా బరితెగింపుతో కొనసాగిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి, ఇటీవల ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బంది గూఢచర్యానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని భారత దౌత్యకార్యాలయం సిబ్బందిపై ఆ దేశ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more