అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం వింత నాటకం.. అని ఎందరో కవులు అన్నా.. ఆ అనుబంధాలు, ఆత్మీయతలో ఓటమిని చూసిన వారి మాటలే అవి అని చెప్పకతప్పదు. బంధాలు అనుబంధాలు.. ఎంతలా ప్రభావం చూపుతాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మనిషన్నవాడు తనలోని భావోద్వేగానికి గురై ఎక్కడైనా కన్నీళ్లు పెట్టుకుంటాడన్నది ఈ సత్యం తెలుపుతోంది. అవి సంతోషంతో తక్కువ సార్లు వస్తే.. బాధతో మాత్రం ఎక్కువ సార్లు కట్టలు తెంచుకుంటాయన్నది వాస్తవం. ఇలా ఒక్క సహచరుడి కోసం ఓ జట్టు పెట్టుకున్న కన్నీళ్లు.. ఆ వీడియోను చూసినవారందరికీ కంటతడి పెట్టిస్తోంది. భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఫుట్‌బాల్ ఆటే ప్రాణంగా బతికిన ఓ కుర్రాడు ఇటీవల మృతి చెందాడు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు మెక్సికో దేశానికి చెందిన ఉభయ పౌరసత్వం కలిగియున్న అలెగ్జాండర్ మార్టినేజ్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితమే అమెరికా నుంచి మెక్సికోకు వచ్చాడు. అక్కడ తన స్నేహితులందరితో కలసిమెలసి ఫుట్ బాట్ ను ఆగాడు. ఆటలో కూడా చాలా చురుగ్గా పాల్గోంటూ రాణించిన యువకుడు ఓ రోజు రాత్రి సోడాను కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అకారణంగా పోలీసులు అతడ్ని షూట్ చేసి చంపేశారన్న అరోపణలు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా తమ మిత్రుడు అలెగ్జాండర్ మార్టినేజ్ శవంగా మారిడంతో ఆయన ప్రాతినిధ్యం వహించే ఫుట్ బాల్ జట్టు శోకసంధ్రంలో మునిగింది.
దీంతో అతడి స్నేహితులు అతనికి గణంగా నివాళి ఘటించారు. అదెలా అంటే శవపేటికలో మార్టినెజ్ మృతదేహాన్ని తీసుకొచ్చి మైదానంలోనే కాసేపు పెట్టారు. గోల్ కోర్టుకు ఎదురుగా శవపేటికను పెట్టి ఒకరు ఫుట్ బాల్‌ను కిక్ చేయగా అది శవపేటికకు తగిలింది. అంతే అది నేరుగా గోల్ పోస్ట్‌లోకి వెళ్లింది. ఫుట్ బాల్ అంటే ప్రాణంగా బతికిన ఆ కుర్రాడి మృతదేహం ఉన్న శవపేటికను తాకినా ఆ బాల్ గోల్ పోస్ట్‌కి వెళ్లింది. దీంతో అతడి స్నేహితులు కన్నీరు ఆపుకోలేకపోయారు. ఇలా మృతిచెందిన తమ స్నేహితుడితో చివరి గోల్ ను చేయించారు.
బంతి గోల్ కోర్టులోకి వెళ్లగానే పరుగెత్తుకుంటూ వచ్చి అతని శవపేటికపై పడి గట్టిగా ఏడ్చాశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట్లోని నెటిజన్లతోనూ కంటతడి పెట్టిస్తోంది. మార్టినేజ్ చివరి గోల్ వేశాడని.. లేదు.. నేను నిజంగా ఏడవడం లేదు.. అంటూ మరోకరు.. మార్టినేజ్ కు మిత్రుల ఘన నివాళి, యువక్రీడాకారుడికి యువకులు నివాళి.. కన్నీళ్లు పెట్టించిన ఘననివాళి అంటూ నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more